Oxygen Shortage: ఆక్సిజన్ కొరత.. ఢిల్లీ గంగారామ్ ఆసుపత్రిలో 25 మంది రోగుల మృత్యువాత..

Delhis ganga-ram-hospital: దేశంలో కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. నిత్యం లక్షాలాది కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో

Oxygen Shortage: ఆక్సిజన్ కొరత.. ఢిల్లీ గంగారామ్ ఆసుపత్రిలో 25 మంది రోగుల మృత్యువాత..
ganga ram hospital
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 23, 2021 | 12:07 PM

Delhis ganga-ram-hospital: దేశంలో కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. నిత్యం లక్షాలాది కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఓవైపు వ్యాక్సిన్, అత్యవసర వైద్య చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ డ్రగ్ కొరత వేధిస్తుంటుంటే.. మరోవైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. క‌రోనా బారిన ప‌డ్డ రోగుల‌కు స‌కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు మృతిచెందారు. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత కారణంగా.. ఢిల్లీలోని స‌ర్ గంగారామ్ ఆసుపత్రిలో గ‌త 24 గంట‌ల్లో 25 మంది రోగులు మరణించారు. ఈ మేరకు శుక్రవారం ఉద‌యం ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. అయితే.. మ‌రో 60 మంది రోగుల ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని, స‌కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క‌పోతే వారిని కూడా ప్రాణాల‌తో కాపాడ‌టం క‌ష్ట‌మ‌ంటూ పేర్కొన్నారు.

ప్రస్తుతం రెండు గంట‌ల‌కు స‌రిప‌డ ఆక్సిజ‌న్ మాత్ర‌మే అందుబాటులో ఉంద‌ని వెల్లడించారు. మ్యానువ‌ల్ వెంటిలేష‌న్ ద్వారా ఐసీయూ, ఎమ‌ర్జెన్సీ వార్డుల్లో రోగుల‌కు చికిత్స చేస్తున్న‌ట్లు తెలిపారు. అయితే ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా రోగులు చ‌నిపోయిన‌ట్లు ఈ ఉద‌యం 8 గంట‌ల‌కు ప్ర‌క‌టించారు. అనంతరం రెండు గంట‌ల‌కు 10 గంటల ప్రాంతంలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు గంగారామ్ ఆసుపత్రికి చేరుకున్నాయి. అయితే.. రోగులు చనిపోవ‌డానికి ఆక్సిజ‌న్ కొర‌త ఒక్క‌టే కార‌ణం కాదని.. ల‌క్ష‌ణాలు తీవ్ర‌మైన త‌ర్వాత చివ‌రి ద‌శ‌లో ఆసుపత్రికి వ‌స్తున్నార‌ని ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆసుపత్రి చైర్మ‌న్ డీఎస్ రాణా తెలిపారు.

ఇదిలాఉంటే.. ఆక్సిజన్ కొరతపై రెండు రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈ వార్త బయటకు వచ్చింది.

Also Read:

PM Modi Meeting: కరోనా విజృంభణ.. కేంద్రం కీలక నిర్ణయం..! సీఎంలతో సంభాషిస్తున్న ప్రధాని మోదీ..

కోవిడ్ ఉధృతి, జర్మనీ నుంచి ఇండియాకు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ దిగుమతి