Heavy Rains: ప్రాణాలు తీస్తున్న వానలు.. భారీ వర్షాలు, వరదలతో ఆ రాష్ట్రంలో 112 మంది మృతి

భారీ వర్షాలు, భీకర గాలులతో మహారాష్ట్ర (Maharashtra) చిగురటాకులా వణుకుతోంది. వర్షాకాలం మొదలైన (జూన్ 1) నుంచి ఇప్పటివరకు 112 మంది వర్షాల కారణంగా మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.రాయ్‌గఢ్‌ జిల్లాలో 52 మంది, రత్నగిరిలో...

Heavy Rains: ప్రాణాలు తీస్తున్న వానలు.. భారీ వర్షాలు, వరదలతో ఆ రాష్ట్రంలో 112 మంది మృతి
Maharashtra Rains
Follow us

|

Updated on: Jul 18, 2022 | 6:58 AM

భారీ వర్షాలు, భీకర గాలులతో మహారాష్ట్ర (Maharashtra) చిగురటాకులా వణుకుతోంది. వర్షాకాలం మొదలైన (జూన్ 1) నుంచి ఇప్పటివరకు 112 మంది వర్షాల కారణంగా మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.రాయ్‌గఢ్‌ జిల్లాలో 52 మంది, రత్నగిరిలో 21, సతారాలో 13, థానేలో 12, కొల్హాపూర్‌లో 7, ముంబైలో 4, సింధుదుర్గ్‌లో ఇద్దరు, పుణేలో ఒకరు మరణించారు. మరో 53 మంది గాయపడ్డారు. 99 మంది జాడ తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది. భారీ వర్షాలే కాకుండా వరదలు, కొండ చరియలు విరిగిపడటం, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలతో అధిక సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రస్తుతం కాస్త తగ్గాయి. ప్రస్తుతం ముంబయిలో వాతావరణం పొడిగా ఉందని అక్కడి వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సహాయక కేంద్రాలకు తరలిస్తున్నారు. విపత్తు తలెత్తితే తక్షణ సహాయం కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేశారు.

రాయ్‌గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, సతారా జిల్లాలపై వర్షం తీవ్ర ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటలో 41 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఎక్కడి నీరు అక్కడే నిలి ఉండటంతో పునరుద్ధరణ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు.. వరద బాధితులకు తాగు నీరు, వైద్యం, ఆహారం, విద్యుత్‌ సదుపాయాలను కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..