తమిళనాడులో (Tamil Nadu) వింతఘటన జరిగింది. ఓ వంతెన రాత్రికి రాత్రే చెస్ బోర్డ్‌లా మారిపోయింది. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. రాష్ట్ర రాజధాని చెన్నైలో (Chennai) నేపియర్ బ్రిడ్జి ఓ ల్యాండ్ మార్క్ లాంటింది. ఇప్పటి...
తమిళనాడులో (Tamil Nadu) వింతఘటన జరిగింది. ఓ వంతెన రాత్రికి రాత్రే చెస్ బోర్డ్‌లా మారిపోయింది. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. రాష్ట్ర రాజధాని చెన్నైలో (Chennai) నేపియర్ బ్రిడ్జి ఓ ల్యాండ్ మార్క్ లాంటింది. ఇప్పటి వరకూ ఈ వంతెన బాగానే ఉంది. సడన్‌గా జూలై 16 ఉదయం చూసేసరికి ఆ బ్రిడ్జ్ కాస్తా చెస్ బోర్డుగా మారిపోయింది. బ్రిడ్జి ఉపరితలంతో పాటు బ్రిడ్జికి ఉన్న రెయిలింగ్ గోడలు కూడా చెస్ బోర్డు (Chess Board) మాదిరిగా మారిపోయాయి. బ్రిడ్జి మొత్తం చెస్ బోర్డులోని తెలుపు, నలుపు గళ్లతో నిండిపోయింది. రాత్రికి రాత్రే ఇలా మారిపోయిన ఈ బ్రిడ్జి ఇప్పుడు చెన్నైవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ బ్రిడ్జి ఇలా మారిపోవడానికి ఓ కారణం ఉంది. తమిళనాడులోని మామళ్లాపురంలో జూలై 28 నుంచి 44వ ఫైడ్ చెస్ ఒలింపియాడ్ మొదలు కానుంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫైడ్) ఆధ్వర్యంలో జరగనున్న ఈ చెస్ ఒలింపియాడ్‌కు గుర్తుగా నేపియర్ బ్రిడ్జిపై పెయింట్ వేసి ఇలా చెస్ బోర్డ్‌లా మార్చేశారు. అదీ అసలు సంగతి. ఏది ఏమైనా చెస్ బోర్డ్‌లా కనిపిస్తున్న ఈ వంతెన చూపరులను ఆకట్టుకుంటోంది.
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. చాలా మంది ఈ విడీయోను తమ స్నేహితులకు, తెలిసిన వారికి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బ్రిడ్జిపై హాయిగా చెస్ ఆడుకోవచ్చని, చెస్ ఒలింపియాడ్ కు ఘన స్వాగతం పలికారని తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి