Andhra Pradesh: కృష్ణా ప్రాజెక్టులకు జలకళ.. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు.. పోటెత్తుతున్న వరద

కృష్ణా నది (Krishna) పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. కర్ణాటక ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో.. అక్కడి అధికారులు వచ్చిన నీటిని దిగువకు...

Andhra Pradesh: కృష్ణా ప్రాజెక్టులకు జలకళ.. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు.. పోటెత్తుతున్న వరద
Krihsna Projects
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 16, 2022 | 5:17 PM

కృష్ణా నది (Krishna) పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. కర్ణాటక ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో.. అక్కడి అధికారులు వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఉన్న మొట్టమొదటి ప్రాజెక్టు జూరాలకు రెండు రోజులుగా వరద వస్తోంది. తుంగభద్ర జలాశయం నిండిపోవడంతో అక్కడి నుంచి విడుదల చేసిన నీరు సుంకేసులకు చేరాయి. జూరాల (Jurala) వద్ద ప్రస్తుతం 1.43 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఆల్మట్టి జలాశయంలోకి 1.18 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువకు 1.12 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ (Narayanapur) ప్రాజెక్టుకు 1.30లక్షల క్యూసెక్కుల వరద రాగా.. 18 గేట్లు ఎత్తి 1.33 లక్షల క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. భీమా నదిపై ఉన్న ఉజని ప్రాజెక్టుకు సైతం వరద భారీగా వస్తోంది. దీంతో జలాశయంలో నీటినిల్వ 70 టీఎంసీలు దాటింది. ఏ క్షణాన్నైనా ఉజని ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కాగా.. జూరాలకు మరి కొన్ని రోజులపాటు వరద ఇదే విధంగా కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు తుంగభద్ర నదిలోనూ వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. తుంగభద్ర జలాశయం నుంచి 30 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇది శుక్రవారానికి ఆర్డీఎస్‌ ఆనకట్టకు చేరే అవకాశం ఉంది. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం పెరిగడంతో ముందస్తు జాగ్రత్తగా సుంకేసుల జలాశయాన్ని ఖాళీ చేశారు. అందులో ఉన్న నీటిని దిగువకు వదిలేశారు. సుంకేశుల ద్వారా శ్రీశైలం ఆనకట్టకు నీటిని విడుదల చేశారు.

మంత్రాలయం వద్ద స్నాన ఘాట్లు పూర్తిగా మునిగిపోయాయి. రచ్చుమర్రి, మాధవరం ఎత్తిపోతల పథకాల చెంతకు నీరు చేరింది. రైల్వే వంతెన, మాధవరం వంతెన వద్ద నది ఉద్ధృతంగా ప్రహిస్తోంది. పలు ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్తు మోటార్లు నీట మునిగాయి. మంత్రాలయం వద్ద భక్తులను స్నానాలకు వెళ్లనీయకుండా బారికేడ్లు పెట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?