Andhra Pradesh: అలా జరిగితే నాదే బాధ్యత.. పాఠశాలల మూసివేతపై మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పాఠశాలల మూసివేతపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా పాఠశాలలను మూసివేయలేదని వెల్లడించారు. అలా జరిగితే విద్యాశాఖ మంత్రిగా బాధ్యత....

Andhra Pradesh: అలా జరిగితే నాదే బాధ్యత.. పాఠశాలల మూసివేతపై మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్
Minister Botsa
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 16, 2022 | 4:45 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పాఠశాలల మూసివేతపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా పాఠశాలలను మూసివేయలేదని వెల్లడించారు. అలా జరిగితే విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకుంటానని చెప్పారు 3, 4, 5 తరగతుల విలీనం తర్వాతే ఫౌండేషన్‌ స్కూల్స్ (Foundation Schools) తీసుకొస్తామని చెప్పారు. విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరో ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామని పేర్కొన్నారు. స్కూల్ లో మొత్తం విద్యార్థుల సంఖ్య 150 దాటితే ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తామన్నారు. విదేశీ విద్యకు జగనన్న పేరులో తప్పేముందన్న బొత్స.. దీనిపై మరోసారి పరిశీలిస్తామని స్పష్టం చేశారు. కాగా.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విలీనం పై కీలక ఆదేశాలిచ్చింది. ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే అందులోనే ఆయా తరగతులను విలీనం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. చదువు కావాలంటే రైల్వేగేట్లు, కాల్వలు, జాతీయ రహదారులు దాటి రావాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. హైవేలపై జీబ్రా క్రాసింగ్‌లు ఉంటాయని, పాఠశాలల ఆయాలు రోడ్డు దాటిస్తారని.. ఇది విలీనానికి అడ్డు కాదని ఉత్తర్వుల్లో జత చేసింది.

ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఒకే హై స్కూల్ ఉంటే అందులోనే 3,4,5 తరగతులను విలీనం చేస్తారు. ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వెయ్యి ఉన్నా ఈ ప్రక్రియ జరుగుతుంది. అదే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోతే యూపీఎస్ లో విలీనం చేయాలని ఆదేశాల్లో తెలిపింది. మూడు కిలోమీటర్ల దూరంలోనే హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే వాటిలో ఉండే మౌలిక సదుపాయాల ఆధారంగా మ్యాపింగ్ చేస్తారు. సమీపంలో బాలికల ఉన్నత పాఠశాల ఉంటే ఎనిమిదో తరగతి వరకు బాలురును అందులో విలీనం చేయనున్నారు. 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉంటే 8వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఏడాదికి వెయ్యిరూపాయల చొప్పున సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇస్తారు.

దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల లోపు ఉండే చిన్నారులు కాల్వలు, రైల్వేగేట్లు, జాతీయ రహదారులను ఎలా దాటుతారని ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో కాల్వలు ఉద్ధృతంగా ప్రవహిస్తుంటాయని, ఇలాంటి సమయంలో పిల్లలను ఒంటరిగా బడికి ఎలా పంపగలమని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కామెంట్లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?