AP: చనిపోదామని గోదాట్లో దూకిన వ్యక్తి.. ఆ తర్వాత మారిన ఆలోచన.. సీన్ కట్ చేస్తే
చావు మనం కోరుకుంటే వస్తుందా..? దానికంటూ ఓ ముహూర్తం ఉంటుంది. చావు, పుట్టుకలు ప్రకృతి ఆధీనం. మనకు భూమిపై గడ్డి గింజలు ఉంటే ఆ యముడు కూడా ఏమీ చేయలేదు. అందుకు ఈ వ్యక్తే నిదర్శనం.
Konaseema: భూమ్మీద నూకలుంటే యమధర్మరాజు కూడా ఏం చేయలేడేమో. కోనసీమలో లంక గ్రామమైన మండపల్లి(mandapalli) కి చెందిన వ్యక్తి మృత్యువుని జయించి ఇదే విషయాన్ని రుజువుచేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని గోదాట్లో(Godavari River) దూకినా తిరిగి మృత్యుంజయుడిలా తిరిగొచ్చాడు కోనసీమకు చెందిన సోమేశ్వరరావు. ఇప్పుడు అతని స్టోరీ సర్వత్రా హల్‌చల్ చేస్తోంది. జీవితం మీద విరక్తి చెంది, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అడపా సోమేశ్వరరావు. అనుకున్నదే తడవుగా సిద్ధాంతం బ్రిడ్జిపై నుంచి గోదాట్లో దూకేశాడు. అయితే వరదనీటిలో పడ్డాక గానీ ఆయనకు జీవితమంటే ఏమిటో అర్థం కాలేదు. అంతే హఠాత్తుగా మళ్ళీ బతికేయాలన్న ఆలోచన వచ్చింది. అయినా వరద నీరు ఊరుకుంటుందా? దీంతో సోమేశ్వరరావుని తనతో పాటుగా తీసుకెళ్ళింది. అయితే వరదల్లో కొట్టుకొచ్చిన ఓ చెట్టు బెరడు పట్టుకొని, 25 కిలోమీటర్లు కొట్టుకెళ్ళాడు. కనకాయలంక వరద మధ్యలో నుంచి దగ్గర కేకలు వినిపించడంతో.. నీటిలో చిక్కుకుపోయిన సోమేశ్వరరావుని గుర్తించారు నరసాపురం డిఎస్పీ వీరాంజనేయరెడ్డి. బోటులో ఎన్డీఆర్‌ఎఫ్ మత్స్యకారులను పంపించి, బాధితుడిని ఒడ్డుకి చేర్చారు. కుటుంబ సభ్యులే మోసం చేశారని, అందుకే ఆత్మహత్య కు ప్రయత్నించానని పోలీసులకు తెలిపాడు సోమేశ్వర రావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..