Bhadrachalam: వరద తగ్గుతున్నా పొంచి ఉన్న మరో ముప్పు.. అంధకారంలో గ్రామాలు.. స్తంభించిన రవాణా
వారం రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి (Godavari) శాంతిస్తోంది. గంటగంటకూ ప్రవాహ ఉద్ధృతి తగ్గుతోంది. దీంతో అధికారులు, మంపు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికీ.. వరద బాధితులకు మరో ముప్పు...
వారం రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి (Godavari) శాంతిస్తోంది. గంటగంటకూ ప్రవాహ ఉద్ధృతి తగ్గుతోంది. దీంతో అధికారులు, మంపు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికీ.. వరద బాధితులకు మరో ముప్పు పొంచి ఉంది. వరదలు తగ్గుతుండటంతో వ్యాధులు (Bhadrachalam) ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణం సగం వరకు నీటిలో మునిగిపోయింది. వరద తగ్గుతుండటంతో ప్రతి చోటా బురద పేరుకుపోయే అవకాశం ఉంది. దీంతో వీధులు దుర్భరంగా మారి తీవ్ర అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తాక్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వరదలతో పాములు, తేళ్లు కొట్టుకొచ్చి, రోడ్లపై తిరుగుతున్నాయి. వరద తగ్గాక ఇవి ఇళ్లల్లోకి చేరే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు.. దుమ్ముగూడెం, చర్ల మండలాలు అంధకారంలో మునిగిపోయాయి. మూడు రోజులుగా పవర్ సప్లై లేక స్థానికులు చీకటిలోనే బిక్కుబిక్కుమంటున్నారు. ఫోన్ సిగ్నళ్లు లేకపోక సమాచార వ్యవస్థ అతలాకుతలమైంది. టీవీలు, ఫోన్లు అందుబాటులో లేక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ట్రాన్స్‌కోకు చెందిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నీటిలో మునగిపోవడంతో ఈ సమస్య తీవ్రమైంది. 200 పైగా గ్రామాల్లో ఇప్పటివరకు రాకపోకలు పునరుద్ధరించలేదు. రోడ్లు ధ్వంసమవడంతో రవాణా నిలిచిపోయింది. నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. భద్రాచలంలో డజన్ అరటి పండ్ల ధరలు రూ.100కు చేరడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. సముద్రంలోకి 25.64లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎనిమిది రోజుల తర్వాత వరద తగ్గుముఖం పట్టినా లంక గ్రామాల్లో మాత్రం పరిస్థితి అలానే ఉంది. ఆయా ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పోలవరం స్పిల్‌వే వద్ద నీటి మట్టం 36.91 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా 21.88లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి