Andhra Pradesh: కాలికి బురద అంటకుండా తిరిగితే కష్టాలు తెలుస్తాయా.. సీఎంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై (CM Jagan) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం ఏరియల్ సర్వే చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాలికి బురద అంటకుండా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై (CM Jagan) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం ఏరియల్ సర్వే చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాలికి బురద అంటకుండా హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకోడానికి ఈ నెల 21, 22 తేదీల్లో తానే.. ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నేపథ్యంలో ఒక్క రోజులో పోలవరం (Polavarm Dam) కాఫర్ డ్యాం ఎత్తు పెంచుతామని కొత్త డ్రామా మొదలు పెట్టారని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. పోలవరం పునరావాస కాలనీలను ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ముంపు గ్రామాలకు ఈపరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
వరదలపై సీఎం జగన్ సీరియస్ గా లేరు. దీంతో క్యాబినెట్, అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పటికీ కనీసం వరద సమాచారం ఇవ్వలేదు. గతంలో ఉన్న విపత్తు నిర్వహణ వ్యవస్థలను జగన్ నాశనం చేశారు. ప్రజలను అప్రమత్తం చేయడం, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్థానిక పార్టీ నేతలు ముంపు బాధితులకు అవసరమైన సహాయం చేయాలి.
– చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
కాగా.. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan).. ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వర్యం బ్యారేజీ, లంక గ్రామాల్లోని పరిస్థితులను పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి బాధిక కుటుంబానికి రూ.2వేలు ఆర్థిక సహాయం, నిత్యవసరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..