G20 Summit: జీ20లో ఆఫ్రికన్ యూనియన్ చేరితే ప్రయోజనం ఏంటి.. ఇదిగో వివరాలు
ప్రపంచ జీడీపీలో దాదాపు 85 శాతం వాటా కలిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే శనివారం భారత్ ప్రతిపాదించిన ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వాన్ని సభ్యదేశాలన్ని అంగీకరించడం ఓ కీలక పరిణామం అని విశ్లేషకులు అంటున్నాపు. అయితే 55కు పైగా ఉన్నటువంటి దేశాలు.. సుమారు 130 కోట్ల జనాభా కలిగిన ఏయూ వీటిలో చేరడంతో జీ20 కూటమి ప్రపంచానికి దగ్గరైంది. అయితే ఈ ప్రాంతంలో 2050 నాటికి జనాభా రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
![G20 Summit: జీ20లో ఆఫ్రికన్ యూనియన్ చేరితే ప్రయోజనం ఏంటి.. ఇదిగో వివరాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/g20-summit-2-1.jpg?w=1280)
ప్రపంచ జీడీపీలో దాదాపు 85 శాతం వాటా కలిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే శనివారం భారత్ ప్రతిపాదించిన ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వాన్ని సభ్యదేశాలన్ని అంగీకరించడం ఓ కీలక పరిణామం అని విశ్లేషకులు అంటున్నాపు. అయితే 55కు పైగా ఉన్నటువంటి దేశాలు.. సుమారు 130 కోట్ల జనాభా కలిగిన ఏయూ వీటిలో చేరడంతో జీ20 కూటమి ప్రపంచానికి దగ్గరైంది. అయితే ఈ ప్రాంతంలో 2050 నాటికి జనాభా రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు జీ20 కూటమిలో ఇప్పటిదాకా ఏయూ నుంచి దక్షిణాఫ్రికా మాత్రమే సభ్యదేశంగా ఉంది. కానీ ఇప్పుడు.. భారత్ చొరవ తీసుకోవడం, సభ్యదేశాల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వాన్ని దక్కించుకుంది.
అయితే జీ20లో చేరితే.. ఆఫ్రికన్ యూనియన్‌కు.. ఇటు కూటమికి పరస్పర ప్రయోజనాలను ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఆఫ్రికాలో వివాదాస్పదంగా ఉన్నటువంటి పశ్చిమ సహారా.. ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర అంతర్జాతీయ వేదికల్లో ప్రాతినిధ్యం కోసం ఒత్తిడి తీసుకొస్తుంది. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో సంస్కరణలు చేయాలని వాదన చేస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు అమెరికాలోనే కాకుండా ఐరోపా దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులకు ఆసక్తిని చూపుతున్నాయి. అయితే చైనా ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారీ స్థాయిలో రుణాలు ఇచ్చే దేశంగాను చలామణి అవుతుంది. అటు రష్యా కూడా ఇక్కడి దేశాలకు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది. ఇక గల్ఫ్ దేశాలు కూడా అక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే తుర్కియే.. అతిపెద్ద మిలటరీ బేస్ సోమాలియాలో ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు కూడా ఆఫ్రికా ఖండంలో తమ భాగాస్వాములు కోసం అన్వేషణలో ఉన్నాయి.
ఇక జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తే.. ఇధి ప్రపంచంలో అతిపెద్ద స్వే్చ్ఛా వాణిజ్యానికి కేంద్రంగా మారుతుంది. అంతేకాక.. వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచానికి అవసరమైనటువంటి వనరులు ఈ ఆఫ్రికా ఖండంలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే ప్రపంచంలో 60 శాతం పునరుత్పాదక శక్తి వనరులు.. ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. అయితే ఇందుకు కావాల్సిన 30 శాతానికి పైగా ఖనిజాలకు ఆఫ్రికాకు నిలయం. లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో కోబాల్ట్.. ఓ కీలకమైన ఖనిజం. ప్రపంచవ్యాప్తంగా లభించేటటువంటి కోబాల్ట్‌లో సగానికి పైగా కాంగోలోనే ఉన్నట్లు ఇటీవల బయటపెట్టి్న నివేదికలో ఐరాస తెలిపింది. అయితే ఇలా ఆఫ్రికాలో వనరులు ఉన్నా కొన్ని దేశాలు వాటిని వాడుకుంటూ లాభాలు ఆర్జిస్తున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం