Special Trains: తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు..
తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ ఎప్పుడు ఉండేదే.. అయితే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాను దృష్టిలో ఉంచుకుని దకిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చే భక్తుల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ తిరుపతి అలాగే.. తిరుపతి హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలును
కడప, సెప్టెంబర్ 09ః తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ ఎప్పుడు ఉండేదే.. అయితే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాను దృష్టిలో ఉంచుకుని దకిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చే భక్తుల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ తిరుపతి అలాగే.. తిరుపతి హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలును కడప మీదుగా నడుపుతున్నట్లు కడప రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ శనివారం వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు నాలుగు సోమవారాలు కంటిన్యూగా ఉంటుందని వివరాలను ప్రకటించారు.
భక్తుల రద్దీ దృశ్యా.. కడప మీదుగా తిరుపతి హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలును ఈ నెల 11, 18, 25 అలాగే.. అక్టోబర్ నెల రెండో తేదీన ప్రత్యేకంగా నడపనున్నారు. అంటే నాలుగు సోమవారాలు హైదరాబాదు నుంచి తిరుపతి చేరుకొని నాలుగు మంగళవారాలు తిరుపతి నుంచి హైదరాబాద్ చేరుకుంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నాలుగు రోజుల వ్యవధిలో హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడవనున్నట్లు రైల్వే శాఖ అధికారి తెలిపారు. 0763 నెంబర్ తో ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులను హైదరాబాద్ తిరుపతికి ప్రయాణికులను చేర్చనుంది.
ముఖ్యంగా ఈ ట్రైన్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల మహబూబ్ నగర్, కర్నూల్, డోన్, గుత్తి, తాడిపత్రి మీదుగా ఎర్రగుంట్ల కడప చేరుకొని అక్కడి నుంచి రాజంపేట రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ నాలుగు రోజులు హైదరాబాదులో రాత్రి 7 గంటల సమయంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
అలాగే ప్రతి మంగళవారం తిరుపతిలో మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు కడప చేరుకొని అక్కడి నుంచి తెల్లవారుజామున 5 గంటలకు తిరిగి సికింద్రాబాద్ స్టేషన్ కు ఈ ప్రత్యేక రైలు చేరుకుంటుందని రైల్వే శాఖ అధికారి కడప రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు.
ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల రద్దీ పెరిగిన దృశ్యా.. ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సౌకర్యాలను వినియోగించుకోవాలని రైల్వే శాఖ అధికారులు కోరారు. ఈ రైలుకు సంబంధించిన సమాచారం కోసం స్థానిక రైల్వే స్టేషన్లలో పొందవచ్చని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..