ధర్మం, న్యాయమే గెలుస్తుందన్న చంద్రబాబు.. మరి భయమెందుకంటూ సజ్జల కౌంటర్
Chandrababu Naidu Arrest: స్కిల్ స్కామ్ అరెస్ట్‌లో.. ధర్మం, న్యాయమే గెలుస్తుందన్నారు చంద్రబాబు. ఈ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో శనివారం వేకువజామున చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును ఏ37గా చేర్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తనను అరెస్టు చేశారన్నారు. తన అరెస్టుపై ప్రజలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సంయమనం పాటించాలని కోరారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నందునే తనను ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోందన్నారు. ఈ కేసులో చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుందన్నారు చంద్రబాబు.
ఈ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఉరితీస్తారా అని ప్రశ్నించడమేంటన్నారు. దబాయింపులతో చంద్రబాబు తప్పించుకోలేరని.. ఆ రోజులు పోయాయని వ్యాఖ్యానించారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..