చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం.. టీడీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చర్యకు ప్రతి చర్య తప్పదంటూ హెచ్చరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్న కేశినేని నాని.. చంద్రబాబు అరెస్టుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చర్యకు ప్రతి చర్య తప్పదంటూ హెచ్చరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్న కేశినేని నాని.. చంద్రబాబు అరెస్టుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు పేరుతో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యే అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటీసులు ఎలా ఇస్తారు? కేసులు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. మొదట్లో అమరావతి భూముల స్కామ్ అన్నారని.. ఇప్పుడు స్కిల్ స్కామ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై అవినీతి మరక వేయాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని కేశినేని నాని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

