Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: పెళ్లై రెండేళ్లు.. ఒక్కసారి కూడా టచ్ చేయనివ్వని భార్య.. ఏంటా అని ఆరా తీస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

ఆ ఇద్దరికీ పెళ్లయ్యింది.. ఇన్నాళ్లకు ఒక జోడీ దొరికిందంటూ ఆ వ్యక్తి ఎంతో మురిసిపోయాడు.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆమెను ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం అంతే ఘనంగా ఊరేగింపుతో వధువును ఇంటికి తీసుకొచ్చాడు. ఇక అక్కడి నుంచి కథ మొదలైంది. ఫస్ట్ నైట్ అయిపోయింది.. సెకండ్ నైట్ అయిపోయింది.. థర్డ్ నైట్ కూడా అయిపోయింది.. చివరకు రోజు కాస్తా నెలలు.. నెలలు కాస్తా సంవత్సరాలు కూడా గడిచిపోయాయి..

Uttar Pradesh: పెళ్లై రెండేళ్లు.. ఒక్కసారి కూడా టచ్ చేయనివ్వని భార్య.. ఏంటా అని ఆరా తీస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..
Wife And Husband
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 10, 2023 | 4:59 AM

ఆ ఇద్దరికీ పెళ్లయ్యింది.. ఇన్నాళ్లకు ఒక జోడీ దొరికిందంటూ ఆ వ్యక్తి ఎంతో మురిసిపోయాడు.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆమెను ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం అంతే ఘనంగా ఊరేగింపుతో వధువును ఇంటికి తీసుకొచ్చాడు. ఇక అక్కడి నుంచి కథ మొదలైంది. ఫస్ట్ నైట్ అయిపోయింది.. సెకండ్ నైట్ అయిపోయింది.. థర్డ్ నైట్ కూడా అయిపోయింది.. చివరకు రోజు కాస్తా నెలలు.. నెలలు కాస్తా సంవత్సరాలు కూడా గడిచిపోయాయి.. కానీ, జరగాల్సిన కార్యం మాత్రం జరుగలేదు. కనీసం ఆమె అతన్ని ముట్టుకోనివ్వలేదు. మొదట్లో ఏదో తన పర్సనల్ ప్రాబ్లమెంట్ అని సరిపెట్టుకున్నాడు. కానీ సంవత్సరాల కొద్దీ ఇలాగే కథ ఉండేసరికి.. అరే ఇదేంట్రా బాబూ అని అనుమానం వ్యక్తం చేశాడు ఆ భర్త. అప్పడు అసలు నిజం తెలిసి చొక్కా జేబు దగ్గర ఉండాల్సిన గుండె కాస్త ప్యాంట్ జేబులోకి జారినంత పని అయ్యింది. ఆ ట్విస్ట్ అలా ఉంది మరి.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కోర్టులో ఈ విచిత్ర కేసు వెలుగు చూసింది. నగరంలోని శాస్త్రి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన పెళ్లి చెల్లదని కోర్టులో కేసు వేశాడు. తన భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. అతని భార్య లింగమార్పిడి చేయించుకుందట. ఆ కారణంగానే తనకు విడాకాలు కావాలని తేల్చి చెప్పాడు సదరు శ్రీవారు. భర్త వాదనలు విన్న కోర్టు.. భార్యకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. సదరు భర్త.. తన పిటిషన్‌లో ఇలా చెప్పుకొచ్చాడు.. తనకు రెండేళ్ల క్రితమే పెళ్లయిందని, అయితే పెళ్లయినప్పటి నుంచి తన భార్య శారీరక సంబంధాలకు అనుమతించలేదని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు. వైద్యులు పరీక్షించగా భార్య శరీర భాగాలు చాలా వరకు అభివృద్ధి చెందలేదని తేలింది. అంతేకాదు తన భార్యకు బట్టతల కూడా ఉందని వాపోయాడు.

ఐదుగురు వైద్యులతో ప్యానెల్ ఏర్పాటు..

ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు.. ఐదుగురు వైద్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసి భార్యకు వైద్య పరీక్షలు చేయించాలని సీఎంఓని ఆదేశించింది. దర్యాప్తు నివేదికను త్వరలో కోర్టులో సమర్పించాలని ఫ్యామిలీ కోర్టు జడ్జి సీఎంఓను ఆదేశించారు. కోర్టు ఆదేశాల తర్వాత.. శుక్రవారం భార్యను పరీక్షించే ఐదుగురు వైద్యులతో కూడిన ప్యానెల్‌ను సిఎంఓ ఏర్పాటు చేసింది.

చీటింగ్ కేసు పెట్టిన భర్త..

ఈ కేసులో భర్త 2021లోనే తన అత్తమామలపై చీటింగ్ కేసు కూడా పెట్టాడు. అయితే ఈ కేసులో వైద్య పరీక్షలు నిర్వహించకుండానే విచారణాధికారి తుది నివేదికను సమర్పించారు. ఇప్పుడు భర్త కూడా ఈ నివేదికను కోర్టులో సవాలు చేశాడు.

దీని ఆధారంగా విడాకులు..

కాన్పూర్‌లో ఇలాంటి కేసు ఇదే మొదటిదని న్యాయ నిపుణులు అంటున్నారు. చట్ట ప్రకారం భార్యకు శారీరక సంబంధానికి తగిన వ్యక్తి కాదని, దీని ఆధారంగా విడాకులు తీసుకోవచ్చని సీనియర్ న్యాయవాది విజయ్ బక్షి తెలిపారు. ప్రస్తుతం, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఈ వివాహం చెల్లుబాటు కానిదిగా ప్రకటించాలని భర్త అభ్యర్థించాడు. మరి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
హీరో శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? వీడియో ఇదిగో
హీరో శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? వీడియో ఇదిగో
హాఫ్ సెంచరీతో చెలరేగిన లివింగ్ స్టోన్.. గుజరాత్‌ టార్గెట్ 170
హాఫ్ సెంచరీతో చెలరేగిన లివింగ్ స్టోన్.. గుజరాత్‌ టార్గెట్ 170
కాపీక్యాట్స్..! వెండితెర కంటే ముందే సెల్లుతెరపైకి మూవీ..
కాపీక్యాట్స్..! వెండితెర కంటే ముందే సెల్లుతెరపైకి మూవీ..
ఈ మొక్కను ఇంట్లో పెంచితే ధనప్రాప్తి ఖాయం!
ఈ మొక్కను ఇంట్లో పెంచితే ధనప్రాప్తి ఖాయం!
తాగునీటిలో చిటికెడు ఉప్పు కలిపి చూడండి..! మిరాకిల్ జరగుతుంది..!
తాగునీటిలో చిటికెడు ఉప్పు కలిపి చూడండి..! మిరాకిల్ జరగుతుంది..!
వక్ఫ్‌ బిల్లుపై వాడివేడిగా చర్చ.. మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు
వక్ఫ్‌ బిల్లుపై వాడివేడిగా చర్చ.. మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు
నవమిరోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి రామయ్య ఆశీస్సులు మీసొంతం
నవమిరోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి రామయ్య ఆశీస్సులు మీసొంతం
Virat Kohli: కోహ్లీకి చెప్పి మరీ వికెట్ తీసిన దమ్మున్నోడు
Virat Kohli: కోహ్లీకి చెప్పి మరీ వికెట్ తీసిన దమ్మున్నోడు
జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2 నమోదు!
జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2 నమోదు!