AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow Milk for Infants: పసి పిల్లలకు ఆవు పొదుగు నుంచి నేరుగా పాలు పట్టొచ్చా..? ఈ సందేహం మీకూ ఉందా..

నవ జాత శిశువులు ఆవు పొదుగు నుంచి నేరుగా పాలు తాగవచ్చా? ఇంత చిన్న వయస్సులోనే ఆవు పాలు లేదా గేదె పాలు ఇవ్వడం ఆరోగ్యానికి మంచిదేనా? అని పలువురు సందేహిస్తున్నారు. ఆవు పాలు పడితే ఏం జరుగుతుందో నిపుణుల అభిప్రాయం ఇక్కడ తెలుసుకుందాం..

Cow Milk for Infants: పసి పిల్లలకు ఆవు పొదుగు నుంచి నేరుగా పాలు పట్టొచ్చా..? ఈ సందేహం మీకూ ఉందా..
Raw Cow Milk For Infants
Srilakshmi C
|

Updated on: Jul 26, 2025 | 9:13 PM

Share

ఆవు పొదుగు నుంచి పసి పిల్లలకు పాలు ఇవ్వడం సరైందేనా అనే సందేహం మీకెప్పుడైనా తలెత్తిందా? దీనికి కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో. ఇందులో ఓ వ్యక్తి తన బిడ్డకు ఆవు పొదుగు నుంచి నేరుగా పాలు తాగిపించడం చూడొచ్చు. దీంతో నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చిస్తున్నారు. దీంతో పిల్లలు ఆవు పొదుగు నుంచి నేరుగా పాలు తాగవచ్చా? ఇంత చిన్న వయస్సులోనే ఆవు పాలు లేదా గేదె పాలు ఇవ్వడం ఆరోగ్యానికి మంచిదేనా? అని పలువురు సందేహిస్తున్నారు. దీనిపై నిపుణుల అభిప్రాయం ఇక్కడ తెలుసుకుందాం..

నిపుణులు ఏమంటున్నారు?

గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని సర్వోదయ హాస్పిటల్‌లోని సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ అర్చన యాదవ్ మాట్లాడుతూ.. ఆవు పాలు నవజాత శిశువులకు సురక్షితం కాదని, ఇది అనేక సమస్యలను కలిగిస్తుందని అంటున్నారు. నవజాత శిశువు జీర్ణవ్యవస్థ ఆవు పాలలోని ప్రోటీన్, కొవ్వును సులభంగా జీర్ణం చేసుకోలేకపోవడం వల్ల శిశువులో కడుపులో అసౌకర్యం కలుగుతుందని అన్నారు. చిన్న వయసులోనే పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం వల్ల శిశువులో పాల అలెర్జీ వస్తుంది. ఆవు పాలలో నవజాత శిశువుకు అవసరమైన ఇనుము, విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉండవు. ఇది శిశువులో పోషకాహార లోపం, రక్తహీనతకు దారితీస్తుందని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

దీనిపై పిల్లల వైద్యుడు పునీత్ ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. పొదుగు నుంచి నేరుగా పాలు తాగడం శిశువుకు చాలా ప్రమాదకరం. అలాంటి పాలలో E. coli, salmonella, brucella, TB germs (మైకోబాక్టీరియం) ఉంటాయి. ఇవి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. అందుకే నవజాత శిశువుకు పచ్చి పాలు ఎప్పుడూ పట్టకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఎల్లప్పుడూ పాలను బాగా మరిగించి మాత్రమే అందించాలని డాక్టర్ చెబుతున్నారు.

పసి పిల్లలకు ఆవు పాలు – గేదె పాలు ఏది మంచిది?

అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం.. పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు అందుబాటులో లేకపోతే వైద్యుడి సలహాతో ఫార్ములా పాలు ఇవ్వడం మంచిది. బిడ్డకు కనీసం 12 నెలలు (1 సంవత్సరం) ఉన్నప్పుడు మాత్రమే ఆవు పాలు ఇవ్వాలి. అప్పుడు శిశువు జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. ఏడాది తర్వాత కూడా ఆవు లేదా గేదె పాలు ఇచ్చే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని డాక్టర్ అర్చన యాదవ్ తెలిపారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.