Health Tips: ఫిల్టర్ వాటర్ vs బాయిల్డ్ వాటర్.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మేలంటే?
Health Care Tips: మన శరీరానికి ఆహారం , గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. అయితే పర్యావరణ కాలుష్యం, జనాభా పెరుగుదల, సహజ వనరుల క్షీణత కారణంగా స్వచ్ఛమైన నీటిని పొందడం చాలా కష్టంగా మారింది. అందుకే కొంతమంది ఫిల్టర్ సహాయంతో నీటిని శుద్ధి చేసి తాగితే..
Health Care Tips: మన శరీరానికి ఆహారం , గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. అయితే పర్యావరణ కాలుష్యం, జనాభా పెరుగుదల, సహజ వనరుల క్షీణత కారణంగా స్వచ్ఛమైన నీటిని పొందడం చాలా కష్టంగా మారింది. అందుకే కొంతమంది ఫిల్టర్ సహాయంతో నీటిని శుద్ధి చేసి తాగితే, మరికొందరు మరిగించిన నీటిని తాగుతున్నారు. కాగా కామెర్లు, టైఫాయిడ్, డయేరియా వంటి కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి కాచిపెట్టిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇదే సమయంలో ఫిల్టర్ వాటర్ సంగతేంటి? ఈ నీళ్లు ఆరోగ్యానికి సురక్షితం కావా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
కుళాయి నీటిలో బ్యాక్టీరియాను చంపేందుకు క్లోరిన్, ఫ్లోరైడ్ వంటి వాటిని కలుపుతారు. అయితే ఈ నీరు పూర్తి సురక్షితమని చెప్పడానికి లేదు. ఎందుకంటే నీరు ప్రవహించే పైపులు, నిల్వ చేసే ట్రీట్‌మెంట్ ట్యాంకులలో కలుషిత కారకాలు ఉంటాయి. ఇవి నీటిని కలుషితంగా మారుస్తాయి. కాగా మరిగే నీరు సేఫ్ అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇది పురాతన పద్ధతుల్లో ఒకటి. దీని ముఖ్య ఉద్దేశ్యం నీటిలో ఉండే సూక్ష్మజీవులను చంపడం. అయితే ఇందులో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నీటిని మరిగించినప్పుడు, అధిక ఉష్ణోగ్రత సూక్ష్మజీవులను తొలగించడానికి సహాయపడుతుంది. కాగా నీటిలో ఉండే మలినాలు, వైరస్‌లు, బ్యాక్టీరియాలను తొలగించేందుకు కనీసం 20 నిమిషాల పాటు నీటిని మరిగించాలి. దీని కంటే తక్కువగా మరిగించినట్లయితే ఆ నీరు తాగడానికి సురక్షితం కాదు. ఈ ప్రక్రియలో సీసం, ఆర్సెనిక్, మెగ్నీషియం, నైట్రేట్లు వంటి మలినాలు కరిగిపోవు.
ఇక మరిగించిన నీటితో పాటు ఫిల్టర్ చేసిన నీరు కూడా తాగడానికి సురక్షితమే. కలుషితమైన లేదా పంపు నీటి నుండి మలినాలను, రసాయనాలు, సూక్ష్మజీవులను తొలగించడానికి వాటర్ ఫిల్టర్ సహాయపడుతుంది. ఇందులో RO నుండి UV వాటర్ ప్యూరిఫైయర్‌ల వరకు, నీటిని శుద్ధి చేయడంలో పలు సాంకేతిక పద్ధతులున్నాయి. ఇక ఫిల్టర్ వాటర్ బరువు తగ్గించే ప్రక్రియలో సహాయపడుతుంది. అలాగే జీవక్రియ, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఇక ఫిల్టర్ చేయని నీటిలో గియార్డియా లాంబ్లియా, క్రిప్టోస్పోరిడియం, విబ్రియో కలరా వంటి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. వీటితో అతిసారం, సెప్సిస్, కలరా వంటి ప్రమాదకరమైన వ్యాధులు తలెత్తుతాయి. కాబట్టి ఫిల్టర్ వాటర్, బాయిల్ వాటర్‌లలో వేటికవే పరిమితులు న్నాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..