AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice vs Roti: అన్నం vs చపాతీ.. ఏది తింటే ఆరోగ్యానికి మంచిదంటే!

షుగర్ పేషెంట్స్ ఆహారం విషయంలో ఎప్పుడూ అలెర్ట్‌గా ఉండాలి. మీరు ఏ ఆహారం తీసుకుంటున్నారు అన్నది చాలా ముఖ్యం. చాలా మంది అన్నం లేదా చపాతీ తినే విషయంలో కన్ఫ్యూజ్‌కి గురవుతారు. కానీ అన్నం, చపాతీలు తిన్నా గ్లూకోజ్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఏదన్నా సరే మితంగా తీసుకోవాలి..

Rice vs Roti: అన్నం vs చపాతీ.. ఏది తింటే ఆరోగ్యానికి మంచిదంటే!
Rice Vs Roti
Chinni Enni
|

Updated on: Dec 19, 2024 | 4:28 PM

Share

ప్రస్తుత కాలంలో ఎవరిని కదిపినా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్, అర్థరైటిస్ ఇతరత్రా సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగానే వ్యాధుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. కొందరు అన్నం తినడం మంచిదంటే.. మరికొందరు చపాతీలు తినడం మేలని అంటున్నారు. శరరీ తత్వాన్ని బట్టి ఉండే సమస్యల కారణంగా ఫుడ్ అనేది తినాల్సి ఉంటుంది. కానీ ఏది ఎక్కువగా తీసుకున్నా అనారోగ్యమే. అందులోనూ చాలా మంది జంక్ ఫుడ్‌కి అలవాటు పడిపోయారు. శరీరక శ్రమ కూడా ఉండటం లేదు. ఇలా అనేక కారణాల వల్ల చాలా మంది సమస్యల బారిన పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఇలాంటి వారు అన్నం తినాలో.. చపాతీ తినాలో అనే కన్ఫ్యూజ్‌కి గురవుతూ ఉంటారు. మరి షుగర్ వ్యాధి ఉన్నవారు అన్నం తింటే మంచిదా.. చపాతీ తింటే మేలా ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట ఇలా చేయండి:

ముందు మీ లైఫ్ స్టైల్ విధానాన్ని, ఆహారపు అలవాట్లను సరి చేసుకోవాలి. సరైన జీవన విధానం ద్వారానే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయగలం. మీకు అసలు షుగర్ వ్యాధి ఎంత ఉంది? ఎలాంటి కేర్ తీసుకోవాలి? శరీరానికి కావాల్సిన ఆహారం ఏంటి? ఏది తింటే పెరుగుతుంది? ఏం చేస్తే షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయి అనేదానిపై అంచనా వేసుకోండి. షుగర్ పేషెంట్స్ తమకంటూ ఖచ్చితంగా ఓ డైట్ మెయిన్‌టైన్ చేయాలి. ఏదో ఒకటి తినేద్దాం అనుకుంటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి మీ కంటూ ఆహర పట్టికను తయారు చేసుకోండి. బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే.. ఇంట్లోనే ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోండి. దీని వలన చక్కెర స్థాయిల్ని అదుపు చేసుకోవచ్చు. అదే విధంగా మీ బరువును బట్టి కూడా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేసుకోండి. వైద్యుల నుంచి సలహాలు తీసుకోండి.

ఏది తింటే మంచిది:

ఏది తింటే మంచిది అనేది మీ వైద్యుల సూచన మీద ఆధారపడి ఉంటుంది. కొంత మందిని అన్నం తినమంటారు.. మరికొందరిని చపాతీ తీసుకోమంటారు. కానీ ఈ రెండింటిలో ఏది తిన్నా పెద్దా తేడా ఏదీ ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకోవాలి. కానీ లిమిట్‌గా రెండు, మూడు సార్లు తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరగవు. మీ శక్తికి తగినట్లుగానే లిమిట్‌గా ఆహారాన్ని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.