రోజూ వేయించిన శనగలు తింటున్నారా..? మీ ఒంట్లో ఏం జరుగుతుందో తెలిస్తే..
వేయించిన పల్లీలు, శనగలు తినడం చాలా మంది టైపాస్ అనుకుంటారు. కానీ, ఇవన్నీ కేవలం కాలక్షేపానికి తీసుకునే ఆహారం కాదు.. ఇందులో బోలెడన్నీ పోషక విలువలు నిండివున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వేయించిన శనగలు తినడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శనగలు ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు , ఇతర విటమిన్ల పవర్ హౌస్ అంటున్నారు నిపుణులు. పచ్చి శనగలను వేయించడం వల్ల ఇందులోని పోషకాల స్థాయి మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
Updated on: Dec 19, 2024 | 4:15 PM

వేయించిన శనగలు ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, విటమిన్లకు మంచి మూలం. వేయించిన శనగలు తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. త్వరగా కడుపు నిండిన సంతృప్తిని కలిగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

శనగలు శాకాహార ప్రోటీన్‌కు గొప్ప మూలం. ఇది కండరాల పెరుగుదల, మరమ్మతుకు సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడే, మలబద్ధకాన్ని నివారించే, కడుపు నిండిన భావాన్ని కలిగించే అధిక-నాణ్యత గల ఫైబర్ శనగలలో సమృద్ధిగా లభిస్తుంది.

శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి అవసరమైన ఐరన్‌కు వేయించిన శనగలు మంచి మూలం. కండరాల, నరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే మాగ్నీషియం మంచి మూలం. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం మంచి మూలం.

బరువు తగ్గడానికి, నియంత్రణకు సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ శనగలు గొప్పగా ఉపయోగపడతాయి.

వేయించిన శనగలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వీటిలో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి దోహదం చేస్తుంది.




