AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reheat Cooked Food: వేడి చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Is heated food safe to eat? పానీయాలు అయినా, ఆహారం అయినా.. చాలా మంది రిఫ్రిజిరేటర్‌లో దాచుకుని ఒకసారి వండిన ఆహారాన్ని పలుమార్లు వేడి చేసుకుని తినేస్తున్నారు. ఆహారాన్ని రిఫ్రిజిరేటర్ నుండి తీసిన తర్వాత వేడి చేసి తినడం మంచిదే. అయితే కొన్ని ఆహారాలు, పానీయాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం వల్ల అవి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని..

Reheat Cooked Food: వేడి చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
Reheat Cooked Food
Srilakshmi C
|

Updated on: Nov 03, 2025 | 1:46 PM

Share

నేటి బిజీ లైఫ్‌లో చాలా మందికి చక్కగా వండుకుని తినే సమయం దొరకడం లేదు. తక్కువ సమయంలో పనులు పూర్తి చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఆహారం, పానీయాల విషయంలో కూడా ఇదే చేస్తున్నారు. ఉదాహరణకు ఉదయం వండిన ఆహారం చల్లబడితే.. రాత్రికి దాన్ని మళ్లీ వేడి చేసుకుని తింటున్నారు. ఇలా పానీయాలు అయినా, ఆహారం అయినా.. చాలా మంది రిఫ్రిజిరేటర్‌లో దాచుకుని ఒకసారి వండిన ఆహారాన్ని పలుమార్లు వేడి చేసుకుని తినేస్తున్నారు. ఆహారాన్ని రిఫ్రిజిరేటర్ నుండి తీసిన తర్వాత వేడి చేసి తినడం మంచిదే. అయితే కొన్ని ఆహారాలు, పానీయాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం వల్ల అవి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి వేడిచేసిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరికొన్ని ఆహారాలను వేడి చేసి తినడం వల్ల ప్రయోజనాలకు బదులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మిగిలిపోయిన అన్నం, పాలకూర, ఉడికించిన కోడి గుడ్డు, బంగాళా దుంపలు, మాంసాహారాలు వంటివి ఒకసారి వండిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయకపోవడమే మంచిది. ఎప్పటికప్పుడు వండుకుని వేడిగా తింటే మరింత ప్రయోజనకరం.

ఆహారం, పానీయాల ఉష్ణోగ్రత కూడా ఆరోగ్యంపై విభిన్న ప్రభావాలను చూపుతుంది. కొందరు వేడి ఆహారం తినడం మంచిదని భావిస్తే.. మరికొందరు చల్లని ఆహారం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం వేడి పానియాలు రుచికరంగా ఉండటమే కాకుండా మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. వేడి పానీయాలు ఉద్రిక్తత, ఒత్తిడి, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక టీ, కాఫీ లేదా ఏదైనా ఇతర వేడి పానీయాలను వేడిగా తాగడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది.

వేడి ఆహారం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి?

శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆహారం, పానీయాల ఉష్ణోగ్రత మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో యునైటెడ్ స్టేట్స్‌లో 400 మందికి పైగా పాల్గొన్నారు. చల్లటి ఆహారాలు తిన్న వారు నిరాశ, నిద్రలేమితో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. అదే సమయంలో శీతాకాలంలో వేడి పానీయాలు తిన్న వారికి అలాంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు తేలింది. వేడి ఆహారాలు, పానీయాలు మానసిక, శారీరక ప్రభావాలను కలిగి ఉంటాయని వీరి అధ్యయనంలో కనుగొన్నారు. అంతేకాకుండా, చల్లని ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఫలితంగా పోషకాలు సరిగ్గా గ్రహించబడవు. అంతేకాకుండా చల్లని ఆహారాలు ప్రాసెస్ చేయబడతాయి. వీటిల్లో పోషకాలు ఉండవు. ఇది ఆరోగ్యానికి హానికరం.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.