- Telugu News Photo Gallery Extremely Health Benefits of Amla Juice on an Empty Stomach in every morning
Amla Juice: ఉసిరితో ఆరోగ్య సిరి.. రోజూ పొద్దునే గ్లాసుడు జ్యూస్ తాగితే సరి
Promising Health Benefits of Amla Juice: శీతాకాలంలో ఎన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నా జలుబుతో సహా అనేక సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకే శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా ఈ కాలంలో ఆరోగ్యం క్షీణించే అవకాశం తక్కువగా ఉంటుంది..
Updated on: Nov 03, 2025 | 1:11 PM

జుట్టు, చర్మానికి ఉసిరి అత్యంత ప్రయోజనకరమైనది. ఉసిరి తీసుకోవడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఉసిరికి ఒత్తిడిని తగ్గించే గుణముంది. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి.

శీతాకాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఓ స్పెషల్ పానీయం తాగాలి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

అదే ఉసిరి. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే సంగతి అందరికీ తెలుసు. ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది అనేక ఆరోగ్య సమస్యలకు శాశ్వత నివారిణి కూడా.

ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఉసిరి రసం తాగాలి. దీనిని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా ఒక మీడియం సైజు ఉసిరి తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని వడకట్టి గ్లాసుడు నీళ్లలో కలిపి తాగితే సరిపోతుంది.

ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి. ఉసిరి ఈ కాలంలో వేధించే చుండ్రుని నివారించి కురులు చక్కగా పెరగడానికి కారణం అవుతుంది.




