Telangana: అయ్యో.. పోలింగ్ రోజే ఎంత ఘోరం.. ఓట్లు లెక్కిస్తూ కుప్పకూలిన అధికారి.. కాసేపటికే..
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల వేళ ములుగు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. వెంకటాపురం మండల కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా ఒత్తిడికి గురై గుండెపోటులో మరణించాడు MPDO రాజేంద్రప్రసాద్. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల వేళ ములుగు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. వెంకటాపురం మండల కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా ఒత్తిడికి గురై గుండెపోటులో మరణించాడు MPDO రాజేంద్రప్రసాద్. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే స్థానిక MPDO రాజేంద్రప్రసాద్ బుధవారం పోలింగ్ నేపథ్యంలో విధులకు హాజరయ్యారు.
అయితే పోలింగ్ ముగిసిన తర్వాత.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన MDPO రాజేంద్రప్రసాద్ సడెన్‌గా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అంబులెన్స్ సహాయంతో ఆయన్ను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయన్ను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు నిర్ధారించారు.
ఇక పరిస్థితి విషమంగా ఉండడంతో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రాజేంద్ర ప్రసాద్‌ను ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ చికిత్స పొందుతూ MPDO రాజేంద్రప్రసాద్ తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలింగ్ రోజే MPDO రాజేంద్రప్రసాద్ మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








