AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహారం చేతిలో నుంచి జారి నేలపాలైతే.. ఎందుకు తినకూడదో తెలుసా? అసలు సీక్రేట్ ఇదే..

ఒక్కోసారి పరధ్యానంగా ఉన్నప్పుడు ఆహారం, చిరుతిళ్లు వంటివి తినేటప్పుడు కూడా నేలపై జారి పడిపోతుంటాయి. అయితే కొంత మంది ఇలా నేలపై పడిన ఆహారాన్ని తిరిగి పాత్రలోకి తీసుకుని తినేస్తుంటారు. ఆహారం వృధా చేయడం ఎందుకని ఇలా కింద పడిపోయిన ఆహారాలు కూడా తీసుకుని తినేస్తారు. ముఖ్యంగా పిల్లలు కింద పడేసిన చాక్లెట్లు, చిరుతిళ్లను తిరిగి నోట్లో పెట్టేసుకోవడం..

ఆహారం చేతిలో నుంచి జారి నేలపాలైతే.. ఎందుకు తినకూడదో తెలుసా? అసలు సీక్రేట్ ఇదే..
Myth Or Reality Of Dropped Food
Srilakshmi C
|

Updated on: Sep 01, 2025 | 9:09 PM

Share

కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్న చేతిలో ఉన్న వస్తువు జారీ పడిపోతుంది. ఇక పరధ్యానంగా ఉన్నప్పుడు ఆహారం, చిరుతిళ్లు వంటివి తినేటప్పుడు కూడా నేలపై జారి పడిపోతుంటాయి. అయితే కొంత మంది ఇలా నేలపై పడిన ఆహారాన్ని తిరిగి పాత్రలోకి తీసుకుని తినేస్తుంటారు. ఆహారం వృధా చేయడం ఎందుకని ఇలా కింద పడిపోయిన ఆహారాలు కూడా తీసుకుని తినేస్తారు. ముఖ్యంగా పిల్లలు కింద పడేసిన చాక్లెట్లు, చిరుతిళ్లను తిరిగి నోట్లో పెట్టేసుకోవడం మీరు చాలా సార్లు చూసే ఉంటారు. అయితే ఇంట్లో పెద్దలు, ముసలి వాళ్లు ఈ దృశ్యాన్ని చూసినప్పుడు నేలపై పడిన ఆహారం తినదగినది కాదని, బ్రహ్మ రాక్షసుల వంటి దుష్ట శక్తులు నేలపై పడిన ఆహారం వైపు ఆకర్షితులవుతాయని చెబుతుంటారు. నేలపై పడిన ఆహారం పవిత్రమైనది కాదని పెద్దలు నమ్ముతారు. చేతి నుండి జారి పడే ఆహారాన్ని తినకూడదనే కారణం వీరి మాటల ఉద్దేశ్యం. కానీ మూఢనమ్మకమే కాదు దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పడిపోయిన ఆహారాన్ని ఎందుకు తినకూడదంటే..?

సాధారణంగా నేలపై పడిన ఏదైనా ఆహారం తిరిగి తీసుకుని తినకూడదని ఇంట్లో పెద్ద వాళ్లు చెబుతుంటారు. ఎందుకంటే ఇది అపవిత్రమైనది, బ్రహ్మ రాక్షసులు ఆకర్షిస్తారు అనేది వాళ్ల నమ్మకం. పెద్దలు అనుసరిస్తున్న ఈ ఆచారం, నమ్మకం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. అదేంటంటే.. ఆహారం నేలపై పడగానే దుమ్ము, బ్యాక్టీరియా, క్రిములు దానికి అంటుకుంటాయి. నేల ఎంత శుభ్రంగా ఉన్నా క్రిములు ఎల్లప్పుడూ నేలపై ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో వాటిని తిరిగి తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయి. అందుకే పెద్దలు నేలపై పడిన ఆహారాన్ని తినకూడదని చెబుతుంటారు..

బ్రహ్మ రాక్షసులు పడిపోయిన ఆహారాన్ని తింటారని చెప్పడానికి కారణం.. పిల్లలు ఎంత చెప్పినా వినరు. కింద పడిపోయిన ఆహారాన్ని తిరిగి నోట్లో పెట్టుకుంటారు. ఇలాంటి మొండి పిల్లలకు దెయ్యం, భూతం అంటూ భయపెట్టే కథలు చెబితే పిల్లలు ఖచ్చితంగా దానిని తినరు. అంతేకానీ దీని వెనుక ఎలాంటి మూఢనమ్మకాలు లేవు. పెద్దలు చెప్పిన ఈ కథ వెనుక అసలు ఉద్దేశ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.