Pineapple in Summer: సమ్మర్‌లో పైనాపిల్ తింటే ఎన్ని ప్రయోజనాలో.. అస్సలు నమ్మలేరు

వేసవి కాలం వచ్చేస్తోంది. ఇప్పటికే ఉష్ణోగ్రత లెవల్స్ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నీటి శాతం ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ సమ్మర్‌లో పైనాపిల్ విరివిగా లభిస్తుంది. దీన్ని సలాడ్‌లా.. జ్యూస్ లా తీసుకోవచ్చు. పైనాపిల్ రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. తియ్యగా.. పుల్లగా.. కాస్త వగరుగా..

Pineapple in Summer: సమ్మర్‌లో పైనాపిల్ తింటే ఎన్ని ప్రయోజనాలో.. అస్సలు నమ్మలేరు
pineapple
Follow us
Chinni Enni

|

Updated on: Feb 16, 2024 | 4:42 PM

వేసవి కాలం వచ్చేస్తోంది. ఇప్పటికే ఉష్ణోగ్రత లెవల్స్ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నీటి శాతం ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ సమ్మర్‌లో పైనాపిల్ విరివిగా లభిస్తుంది. దీన్ని సలాడ్‌లా.. జ్యూస్ లా తీసుకోవచ్చు. పైనాపిల్ రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. తియ్యగా.. పుల్లగా.. కాస్త వగరుగా.. జ్యూసీగా ఉంటుంది. ఇందులో కాపర్, మాంగనీస్, డైటరీ ఫైబర్, విటమిన్ సి, బి6, ఫోలేట్ వంటివి ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. మరి సమ్మర్‌లో పైనాపిల్ తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం.

చర్మం ఆరోగ్యం:

పైనాపిల్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించి, చర్మానికి కాంతివంతంగా తయారు చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

పైనాపిల్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయ పడుతుంది. కాబట్టి రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా ఈ ఫ్రూట్ తింటే తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. సమ్మర్‌లో రోగ నిరోధక శక్తి, ఎనర్జీ లెవల్స్ చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది:

వేసవిలో జీర్ణ క్రియకు సంబంధించి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీని వల్ల అజీర్తి, విరేచనాలు లేదా మల బద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ పైనాపిల్ తీసుకుంటే ఆ సమస్యలు రాకుండా చూడొచ్చు. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది:

వేసవిలో త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పైనపిల్ తరచూ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడేస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వారు కూడా పైనాపిల్ హ్యాపీగా తినొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.