Kitchen Hacks: ఈ ఈజీ టిప్స్‌తో మీ స్టీల్ పాత్రలను మిలమిలమని మెరిపించండిలా!

అందరి ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించే పాత్రల్లో స్టీల్ కూడా ఒకటి. వీటిని తరచూ ఉపయోగిస్తూ ఉంటారు. స్టీల్ పాత్రలను వాడే కొద్దీ.. కలర్ మారుతూ ఉంటాయి. ఒక్కసారి మాడాయంటే వాటిని వదిలించడం చాలా కష్టం. అందులోనూ స్టెయిన్ లెస్ పాత్రలు వాష్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిపై మరకలు పడితే త్వరగా వదలవు. అలాగే ఎలా పడితే అలా శుభ్ర పరిస్తే.. అనారోగ్య సమస్యలు త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టీల్ పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు..

Kitchen Hacks: ఈ ఈజీ టిప్స్‌తో మీ స్టీల్ పాత్రలను మిలమిలమని మెరిపించండిలా!
Kitchen Hacks
Follow us
Chinni Enni

|

Updated on: Feb 16, 2024 | 1:12 PM

అందరి ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించే పాత్రల్లో స్టీల్ కూడా ఒకటి. వీటిని తరచూ ఉపయోగిస్తూ ఉంటారు. స్టీల్ పాత్రలను వాడే కొద్దీ.. కలర్ మారుతూ ఉంటాయి. ఒక్కసారి మాడాయంటే వాటిని వదిలించడం చాలా కష్టం. అందులోనూ స్టెయిన్ లెస్ పాత్రలు వాష్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిపై మరకలు పడితే త్వరగా వదలవు. అలాగే ఎలా పడితే అలా శుభ్ర పరిస్తే.. అనారోగ్య సమస్యలు త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టీల్ పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు శుభ్రం చేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే.. అవి శుభ్రంగా ఉండటంతో పాటు.. కొత్త వాటిలా మిలమిలమని మెరుస్తూ ఉంటాయి. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

డిష్ సోప్స్ ఉపయోగించాలి:

చాలా మంది పాత్రలను సర్ఫ్ లేదా బట్టల సబ్బు లేదా ఏవి పడితే వాటిని ఉపయోగించి క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ డిష్ సోప్స్‌తోనే శుభ్ర పరచుకోవాలి. ఆ తర్వాత మైక్రో ఫైబర్ క్లాత్‌తో తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా చేస్తే మరకలు తొలగి.. క్రిములు, బ్యాక్టీరియా రాకుండా ఉంటాయి.

ఆలీవ్ ఆయిల్:

మీ స్టీల్ పాత్రలు మిలమిలమని మెరవాలంటే ఆలీవ్ ఆయిల్ బాగా సహాయ పడుతుంది. మీరు ఉపయోగించే డిష్ వాష్ సోప్‌లో కొద్దిగా ఆలీవ్ ఆయిల్ వేయండి. ఆ తర్వాత గిన్నెలను శుభ్రం చేస్తే.. అవి కొత్త వాటిలా మెరుస్తాయి. పాత్రలపై జిడ్డు, మరకలు ఏమన్నా ఉంట పోతాయి.

ఇవి కూడా చదవండి

గ్లాస్ క్లీనర్:

గ్లాస్ క్లీనర్ డిష్ సోప్‌తో మరకలు అనేవి త్వరగా పోతాయి. దీన్ని స్టీల్ పాత్రలు క్లీన్ చేసుకోవడంలో కూడా ఉపయోగించుకోవచ్చు. మైక్రోఫైబర్​ క్లాత్​ ఉపయోగించి మరకలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల మరకలు తొలుగుతాయి.

వైట్ వెనిగర్:

స్టీల్ పాత్రలు క్లీన్ చేయడానికి వైట్ వెనిగర్ కూడా ఉపయోగ పడుతుంది. స్టీల్ పాత్రల మీద మరకలు ఎక్కువగా ఉంటే.. ఓ క్లాత్ సహాయంతో.. కొద్దిగా వైట్ వెనిగర్ తీసుకుని మరకలు ప్రదేశంలో రుద్దాలి. ఇలా చేస్తే స్టీల్ పాత్రలపై పడ్డ మరకలు త్వరగా పోతాయి. దుమ్మూ, ధూళి వంటివి తొలగిపోతాయి. అదే విధంగా సోడా కూడా పాత్రలపై పడ్డ మరకలను ఈజీగా తొలగించడంలో బాగా సహాయ పడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.