AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Propose Day 2022: మనసులోని భావాలను ఇష్టమైనవారికి ఇలా తెలియజేయండి.. ప్రపోజ్ డే అందమైన కోట్స్ మీకోసం..

Valentine’s Week 2022: ప్రేమ.. తెలియకుండానే ఆ అందమైన అనుభూతి చెంత చేరుతుంది. ఆకర్షణగా మొదలైన.. అంతులేని ఇష్టంగా మారి మనసులో పదిలంగా ఉండిపోతుంది.

Propose Day 2022: మనసులోని భావాలను ఇష్టమైనవారికి ఇలా తెలియజేయండి.. ప్రపోజ్ డే అందమైన కోట్స్ మీకోసం..
Propose Day
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2022 | 8:16 AM

Share

Valentine’s Week 2022: ప్రేమ.. తెలియకుండానే ఆ అందమైన అనుభూతి చెంత చేరుతుంది. ఆకర్షణగా మొదలైన.. అంతులేని ఇష్టంగా మారి మనసులో పదిలంగా ఉండిపోతుంది. తమకు నచ్చినవారు ఎదురుగా ఉన్న మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి సంకోచిస్తుంటారు. అలా తమ మాటలను ఇష్టమైనవారికి చేరవేయకుండానే గడిపేస్తుంటారు. ప్రేమికులకు ఎంతో ముఖ్యమైన వాలెంటైన్ వీక్ మొదలైంది. ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికీ మాత్రమే కాదు.. ప్రేమను తెలియజేయాలనుకున్నా.. తెలుపలేక ఆగిపోయిన వారికి ఈ వాలెంటైన్ వీక్ స్పెషల్ అనే చెప్పుకొవాలి. ఏడు రోజులుగా సందడిగా సాగే ఈ వాలెంటైన్ వీక్.. ప్రేమికులకు ఒక పెద్ద పండగలాంటింది. మొదటి రోజు రోజ్ డేతో మొదలై.. ఏడవ రోజు ప్రేమికుల రోజు వరకు ప్రతి రోజు ఒక అర్థంతో ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే ఇలా ఏడు రోజులు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఇక నిన్న రోజ్ డే కగా.. ఈరోజు ప్రపోజ్ డే వచ్చేసింది. ఈరోజు ఎంతో మంది తమ మనసులోని భావాలను తమకు ఇష్టమైనవారికి తెలియజేయాలని కుతూహలంగా వెయిట్ చేస్తుంటారు.

వాలెంటైన్ వీక్‏లో రెండవ రోజు ప్రపోజ్ డే జరుపుకుంటారు. ఇది కేవలం ప్రేమలో ఉన్నవారికీ.. యువతీయువకులకు మాత్రమే కాదు.. అమ్మనాన్నలను ప్రేమించే పిల్లలకు.. తోబుట్టువులను మనస్పూర్తిగా ప్రేమించేవారికీ.. ఎలాంటి కల్మషం లేని స్నేహితులకు.. వారి పట్ల తమ వద్ధ ఎంత ఇష్టం దాగి ఉందో మాటల్లో చెప్పుకోవడమే ఈ ప్రపోజ్ డే. మరీ మీకు ఇష్టమైన వారికి ఈ ప్రపోజ్ డే రోజున వారిపట్ల మీకు ఉన్న ఇష్టాన్ని అందంగా వివరించాలనుకుంటున్నారా ?.. అయితే మీకోసం ఈ అందమైన ప్రపోజ్ డే కోట్స్ చూసేయ్యండి..

నేను ప్రేమించింది నిన్నే.. ప్రేమిస్తుంది నిన్నే.. ప్రేమిస్తూ ఉండేది కూడా నిన్నే.. నిమిషాలు.. గంటలు.. రోజులు.. ఇలా ఏమైనా మారవచ్చు కానీ.. నీ మీద నాకున్న ప్రేమ మాత్రం మారదు..

నాది అనుకున్న ప్రతి క్షణం.. నాకు గుర్తుకొచ్చేది నువ్వే.. ఎందుకంటే నా జీవితంలో ఉన్న ప్రతి క్షణం నువ్వే కాబట్టి.. నాకున్న అన్ని సంతోషాలలో నువ్వే ముఖ్యం..

నీవే నా అంతం.. నీవే నా అంతరాత్మ.. నీ నా ఆత్మ.. నీవే నా పరమాత్మ.. నీవే నా మరో జన్మాత..

ఊహ తెలిసిన దగ్గరి నుంచి ఊహించనేలేదు.. ఊహించలేనంతంగా నిన్ను ప్రేమిస్తాననీ.. లవ్ యూ..

సముద్రాన్ని ఆవిరి చేసేంత ద్వేషం నీ దగ్గర ఉంటే.. ఆ సముద్రాన్ని సైతం నా ఒడిలో దాచుకునేంత ప్రేమ నాలో ఉంది..

నువ్వు నడిచేటప్పుడు నీ నీడలాగా.. నేను నడిచేటప్పుడు నా నీడలాగా కనిపిస్తుంది. కానీ మనం కలిసి నడిచేటప్పుడు మన ఇద్దరి నీడలు ప్రేమలాగా కనిపిస్తాయి..

సంతోషంగా ఉన్న క్షణాల్లో నువ్వు చెంతలేకపోయినా.. భాధపడే క్షణంలో నా పక్కన ఉంటావని కోరుకుంటున్నా.

ఉదయం నిద్రలేచినప్పుడు మొదలవుతుంది నా మనసులో నీ ఆలోచనల అలజడి.. నా కంటిమీద రెప్ప పడే వరకూ ఎన్ని వందలసార్లు నువ్వు గుర్తుకువస్తావో తెలుసా నేస్తమా..

Also Read: Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు

Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Sarkaru Vaari Paata: ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న మహేష్.. సర్కారు వారి పాట నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Nandita Swetha: హీరోయిన్ శారీరాకృతిపై నెటిజన్ వల్గర్ కామెంట్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నందితా శ్వేత..