Sarkaru Vaari Paata: ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న మహేష్.. సర్కారు వారి పాట నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‏గా నటిస్తుండగా

Sarkaru Vaari Paata: ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న మహేష్.. సర్కారు వారి పాట నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Mahesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 07, 2022 | 8:06 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‏గా నటిస్తుండగా.. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగ జరుగుతున్న సమయంలో మహేష్ మోకాలికి సర్జరీ జరగడం.. ఆ తర్వాత మహేష్.. కీర్తి సురేష్ కోవిడ్ బారిన పడడంతో షూటింగ్ వాయిదా పడింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ పై అనేక రకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సర్కారు వారి పాట చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

అయితే చాలా రోజులుగా మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా సాంగ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ నెలలో సర్కారు వారి పాట నుంచి సాంగ్స్ రిలీజ్ చేయనున్నట్లుగా గతంలోనే తెలిపారు మేకర్స్. తాజాగా ఈరోజు సర్కారు వారి పాట నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరిన 14న ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)