AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine Beauty Tips 2022: వాలంటైన్స్‌ డే వీక్‌లో అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

ప్రపంచంలోని ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా సెలబ్రేట్ చేసుకునే వాలెంటైన్స్ డే (Valentine's Day)కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడే రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే అంటూ వాలెంటైన్స్ వీక్ (Valentines week) కూడా ప్రారంభమైంది

Valentine Beauty Tips 2022: వాలంటైన్స్‌ డే వీక్‌లో అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..
Basha Shek
|

Updated on: Feb 08, 2022 | 6:46 AM

Share

ప్రపంచంలోని ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా సెలబ్రేట్ చేసుకునే వాలెంటైన్స్ డే (Valentine’s Day)కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడే రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే అంటూ వాలెంటైన్స్ వీక్ (Valentines week) కూడా ప్రారంభమైంది. దీంతో ఈ ప్రేమికుల పండగను ఎలా సెలబ్రేట్‌ చేసుకుందామా? అని చాలామంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ అందం, ఆహార్యంతో తమ ప్రేమికుడిని ఎలా మెస్మరైజ్‌ చేద్దామా? అని ఆలోచిస్తుంటారు. ఈక్రమంలో మీరు కూడా ఈ వాలంటైన్స్‌డే వీక్‌లో అందంగా మెరిసిపోవాలంటే కొన్ని సౌందర్య చిట్కాలు (Beauty Tips) పాటించక తప్పదు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మేకప్‌ వేసుకోవడం, తీసుకోవడంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ముఖం మెరుపును సంతరించుకుంటుంది. మరి ఈ వాలంటైన్స్‌డే వీక్‌లో పాటించాల్సిన కొన్ని చర్మ సంరక్షణ చిట్కాల గురించి తెలుసుకుందాం రండి.

మేకప్ ఎలా తీయాలంటే?

వాలెంటైన్స్ డే రోజున మీ అందమైన రూపాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి, రాత్రి పడుకునే ముందు, మీరు అన్ని రకాల ఫేస్ మేకప్‌లను శుభ్రం చేసుకోవాలి. మేకప్ శుభ్రం చేసుకోవడానికి, మేకప్ క్లీనర్ లేదా నూనె సహాయం తీసుకుంటే మంచి ఫలితముంటుంది. ఆ తర్వాత ముఖంపై కొద్దిగా నైట్ క్రీమ్ అప్లై చేయండి. ఫలితంగా ముఖం తాజాగా, రిఫ్రెష్ గా కనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లే ముందుకు మేకప్‌ మరీ భారీగా కాకుండా తేలికగా వేసుకోవాలి.

క్లెన్సర్‌ని తప్పకుండా వాడండి..

ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు తప్పనిసరిగా క్లెన్సర్‌ని ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. దీనితో పాటు రాత్రి పడుకునే ముందు కళ్లకున్న కాటుక, ఇతర ఐ ల్యాష్‌లను పూర్తిగా తొలగించాలి. రోజు ఇలా చేస్తే కళ్లతో పాటు చర్మం కూడా మెరుపును సంతరించుకుంటుంది. ఇక స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో భాగంగా క్లెన్సర్ తర్వాత టోనర్‌ను తప్పనిసరిగా చేర్చుకోవాలి. టోనర్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

ఫేషియల్‌ మసాజ్‌..

స్కిన్ కేర్ రొటీన్‌లో భాగంగా మేకప్‌ను తొలగించిన తర్వాత క్లెన్సింగ్, టోనర్ ఆపై నైట్ క్రీమ్ రాసుకోవాలి. నైట్‌ క్రీమ్‌ చేతుల్లో తీసుకుని సుమారు 15 నిమిషాల పాటు ముఖంపై మసాజ్‌ చేసుకోవాలి. ఇలా మసాజ్‌ చేయడం వల్ల ముఖంపై మేకప్‌ మరకలు తొలగిపోతాయి. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. ముఖంలోని డల్‌నెస్‌ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఫలితంగా వాలంటైన్స్‌డే రోజు మీ ప్రియుడు/ప్రియురాలికి మరింత అందంగా కనిపిస్తారు.

Also Read:Nivetha pethuraj: డిజిటల్ ఎంట్రీకి సిద్దమైన టాలెంటెడ్ బ్యూటీ.. ఆహాలో నివేదా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’..ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్..

Job Mela: నేడు హైదరాబాద్‌లో మెగా జాబ్‌ మేళా.. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న వారికి కూడా ఛాన్స్‌..

AP Central University: ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.450 కోట్లు మంజూరు.. లోక్‌సభలో వెల్లడించిన కేంద్రం..