Job Mela: నేడు హైదరాబాద్‌లో మెగా జాబ్‌ మేళా.. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న వారికి కూడా ఛాన్స్‌..

Job Mela: కరోనా పరిస్థితులు మెరుగవుతోన్న నేపథ్యంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు నియామకాలకు బ్రేక్‌ వేసిన కంపెనీలు ఇప్పుడు మళ్లీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు..

Job Mela: నేడు హైదరాబాద్‌లో మెగా జాబ్‌ మేళా.. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న వారికి కూడా ఛాన్స్‌..
Job Mela
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 08, 2022 | 6:30 AM

Job Mela: కరోనా పరిస్థితులు మెరుగవుతోన్న నేపథ్యంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు నియామకాలకు బ్రేక్‌ వేసిన కంపెనీలు ఇప్పుడు మళ్లీ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హైదాబాద్‌లో మేగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 8) రోజున ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌లో ఉన్న ఖాజా మ్యాన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ జాబ్‌ మేళా జరగనుంది. ఈరోజు ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఈ జాబ్‌మేళాలో ఏకంగా 40 కంపెనీలు పాల్గొననున్నాయి. అనుభవం ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్‌ కూడా ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో పదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన వారు హాజరుకావొచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి రెజ్యూమ్‌తో పాటు విద్యార్హత జిరాక్స్‌ కాపీలు, ఫోటోలు, అనుభవం ఉన్న వారు వాటి సంబంధిత సర్టిఫికేట్లతో హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 8374315052 నెంబర్‌ను సంప్రదించాలి.

Also Read: CSIR – CEERI Recruitment 2022: పదో తరగతి అర్హతతో అదిరిపోయే ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..

Health Tips: చెప్పులు లేకుండా వాకింగ్ చేయడం మంచిదేనా? దాని వలన ఉపయోగం ఉంటుందా? తెలుసుకోండి!

Viral Video: వామ్మో.! ఇదేం తాబేలు.. స్పైడర్‌‌లా గోడపై జరజరా ఎక్కేస్తోంది.. వీడియో చూస్తే అవాక్కే.!