AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women: మహిళలకు గమనిక.. డెలివరీ తర్వాత కెరీర్ కొనసాగాలంటే ఇవి తప్పనిసరి..

Women: తల్లి కావాలనే ప్రయాణం అంత సులభం కాదు. గర్భం దాల్చినప్పటి నుంచి మొదలైన సమస్యలు ప్రసవం తర్వాత కూడా కొనసాగుతాయి.

Women: మహిళలకు గమనిక.. డెలివరీ తర్వాత కెరీర్ కొనసాగాలంటే ఇవి తప్పనిసరి..
Career
uppula Raju
|

Updated on: Feb 08, 2022 | 7:51 AM

Share

Women: తల్లి కావాలనే ప్రయాణం అంత సులభం కాదు. గర్భం దాల్చినప్పటి నుంచి మొదలైన సమస్యలు ప్రసవం తర్వాత కూడా కొనసాగుతాయి. ఇది కాకుండా తల్లి ముఖ్యంగా పిల్లల సంరక్షణ బాధ్యతను భరించాలి. ఈ పరిస్థితిలో స్త్రీ గర్భధారణకు ముందు పని చేస్తూ ఉంటే డెలివరీ తర్వాత మళ్లీ కెరీర్ బాధ్యతలను ప్రారంభించడం చాలా సవాలుగా మారుతుంది. లాంగ్ గ్యాప్ కారణంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. చాలా మంది మహిళలు బిడ్డ పుట్టిన తర్వాత గృహిణిగా జీవించడానికి ఇష్టపడటానికి ఇదే కారణం. కానీ మీరు కెరీర్ ఓరియెంటెడ్ ఉమెన్ అయితే లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల డెలివరీ తర్వాత మీ కెరీర్‌ను మళ్లీ ప్రారంభించాలని అనుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని కోసం ఈ చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది..

మిమ్మల్ని మీరు అప్‌డేట్‌గా ఉంచుకోండి

చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత పిల్లల సంరక్షణలో బిజీగా ఉంటారు. వారు తమను తాము అప్‌డేట్‌గా ఉంచుకోవడం మర్చిపోతారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. మీరు మీ కెరీర్‌ని మళ్లీ ప్రారంభించాలనుకుంటే మీ ఫీల్డ్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ తెలుసుకుంటూ ఉండండి.

ప్లానింగ్‌తో గ్యాప్ తీసుకోండి

మీరు మీ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా మీ కెరీర్‌పై పూర్తి శ్రద్ధ పెట్టాలనుకుంటే గర్భధారణ విషయంలో ప్లాన్ చేసుకోండి. ఎలాంటి ప్లానింగ్ లేని వారితో చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువ గ్యాప్ ఉండకుండా అన్ని అనుకూలంగా ఉండేవిధంగా ప్రయత్నించండి.

ఇంటి నుంచి పని

కరోనా ప్రజలకు ఇంటి నుంచి పని చేసే కొత్త సంస్కృతిని అందించింది. దీని ద్వారా కొంతమంది ఉద్యోగులు చాలా సౌకర్యంగా ఫీలవుతున్నారు. మీరు శిశువు సంరక్షణ గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తే మీరు డెలివరీ తర్వాత ఇంటి నుంచి పని చేయవచ్చు. దీంతో మీరు మీ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా ఉద్యోగం కూడా చేయగలరు.

ధైర్యంగా ఉండాలి

మీరు చాలా గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూకి వెళితే చింతించకండి పాజిటివ్‌గా ఆలోచించండి. మీరు అప్‌డేట్ అయితే మీ కెరీర్ అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది. మీకు గ్యాప్ వచ్చినా పర్వాలేదు. కాబట్టి మీ ఆలోచనను పాజిటివ్‌గా మార్చుకోవడం ద్వారా మాత్రమే ముందుకు కొనసాగండి.

జనవరి 2022లో అత్యధిక అమ్ముడైన కార్లు ఇవే.. మారుతి సుజుకి వ్యాగన్ R నెంబర్ వన్

ఈ శ్రీలంక పేసర్ రిటైర్మెంట్ ప్రకటించాడు‌.. టీమిండియాపైనే అరంగ్రేటం.. టీమిండియాతోనే ముగింపు..

Shahrukh Khan: ఈ మ్యాచ్‌ ఫినిషర్ అంటే షారుక్‌కి ఆరాధ్య దైవం.. టీమిండియా జెర్సీ ధరించడానికి రెడీ..