ఈ శ్రీలంక పేసర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.. టీమిండియాపైనే అరంగ్రేటం.. టీమిండియాతోనే ముగింపు..
Suranga Lakmal: ఈ నెలాఖరులో శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో శ్రీలంక జట్టు భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో శ్రీలంక జట్టులో అత్యంత
Suranga Lakmal: ఈ నెలాఖరులో శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో శ్రీలంక జట్టు భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో శ్రీలంక జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు సురంగ లక్మల్ కెరీర్ కూడా ముగియనుంది. భారత పర్యటన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లక్మల్ ప్రకటించాడు. లక్మల్ తన అంతర్జాతీయ కెరీర్‌ను 13 సంవత్సరాల క్రితం 2009లో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో ప్రారంభించాడు. ఇప్పుడు అతని కెరీర్ భారత్‌తోనే ముగుస్తుంది.
శ్రీలంక క్రికెట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో భారత పర్యటన తర్వాత లక్మల్ మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపింది. 34 ఏళ్ల లక్మల్ ఈ ప్రకటనలో తన సహచరులకు కృతజ్ఞతలు తెలుపుతూ “నా ఆటగాళ్లు, కోచ్‌లు, జట్టు మేనేజర్లు, సహాయక సిబ్బంది, నిర్వాహకులు, ఇతర సిబ్బంది పట్ల నాకు చాలా గౌరవం ఉంది” అన్నాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌లలో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన తుఫాను పేసర్ తన బోర్డుకు కృతజ్ఞతలు తెలిపాడు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం చాలా మెరుగుపడిందని చెప్పాడు. లక్మల్ మాట్లాడుతూ “నా వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని మెరుగుపరచడంలో శ్రీలంక బోర్డు ప్రధాన పాత్ర పోషించింది. ఇలాంటి బోర్డుతో అనుబంధం కలిగి ఉండటానికి, నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీలంక క్రికెట్‌కు ధన్యవాదాలు ” అన్నాడు.
లక్మల్ కెరీర్
సురంగ లక్మల్ అంతర్జాతీయ కెరీర్ 2009లో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో ప్రారంభమైంది. డిసెంబర్ 2009లో నాగ్‌పూర్‌లో భారత్‌పై లక్మల్ అరంగేట్రం చేశాడు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత నవంబర్ 2010లో అతను వెస్టిండీస్‌పై తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. అతని అంతర్జాతీయ T20 కెరీర్ 2011లో ప్రారంభమైంది. లక్మల్ ఇప్పటి వరకు మొత్తం 68 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 168 వికెట్లు అతని ఖాతాలో చేరాయి. ఒక ఇన్నింగ్స్‌లో 4 సార్లు 5 వికెట్లు తీశాడు. అదే సమయంలో 86 వన్డేల్లో లక్మల్ 109 వికెట్లు తీయగా, 11 టీ20ల్లో 8 వికెట్లు మాత్రమే తీశాడు. భారత్‌పై లక్మల్ 2 టెస్టుల్లో 8 వికెట్లు, 11 వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టగా, ఏకైక టీ20లో విజయం సాధించలేకపోయాడు.
Former Sri Lanka Test Captain Suranga Lakmal has informed Sri Lanka Cricket that he will retire from all forms of International Cricket following the completion of the upcoming Sri Lanka Tour of India 2022https://t.co/ALi5H8H8vz
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) February 2, 2022