Prasar Bharati Jobs 2022: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. జీతం 40 వేల నుంచి 50 వేల వరకు..?

Prasar Bharati Jobs 2022: న్యూస్ రీడర్, ట్రాన్స్‌లేటర్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రసార భారతి సెక్రటేరియట్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Prasar Bharati Jobs 2022: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. జీతం 40 వేల నుంచి 50 వేల   వరకు..?
Prasar Bharati Jobs 2022
Follow us

|

Updated on: Feb 02, 2022 | 7:08 PM

Prasar Bharati Jobs 2022: న్యూస్ రీడర్, ట్రాన్స్‌లేటర్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రసార భారతి సెక్రటేరియట్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. న్యూస్ రీడర్ & ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ 28 ఫిబ్రవరి 2022 గా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద న్యూస్ రీడర్, ట్రాన్స్‌లేటర్ (ఎన్‌ఆర్‌టి) ఉర్దూ 5 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 40 వేల నుంచి 50 వేల మధ్య జీతం లభిస్తుంది.

జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంగ్లిష్ / ఉర్దూ / హిందీ జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్‌లో పిజి / పిజి డిప్లొమా లేదా ఉర్దూలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. ఇది కాకుండా అభ్యర్థి ఏదైనా వార్తా సంస్థలో (ప్రింట్ / టీవీ / డిజిటల్ ప్లాట్‌ఫారమ్ / రేడియో) 3 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉండాలి.

బాధ్యతలు

ప్లాట్‌ఫారమ్ అవసరానికి అనుగుణంగా కథనాలను అనువదించాలి. సవరించాలి డ్రాఫ్ట్ చేయాలి. రేడియో, డిజిటల్ మాధ్యమాల కోసం స్క్రిప్ట్‌లను ఆకర్షణీయంగా రాయగలగాలి. డిమాండ్ ప్రాతిపదికన ప్రత్యేక ఈవెంట్‌ల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించాలి. AV మాధ్యమం కోసం మంచి ప్రదర్శన నైపుణ్యాలతో ఆకట్టుకునే వాయిస్ ఉండాలి.

ఇలా దరఖాస్తు చేసుకోండి

నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు ప్రసార భారతి వెబ్‌సైట్‌లో ప్రచురించిన తేదీ నుంచి 30 రోజులలోపు డాక్యుమెంట్‌లతో పాటు https://applications.prasarbharati.org/ ప్రసార భారతి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడంలో ఏదైనా సమస్య ఉంటే స్క్రీన్‌షాట్‌లతో hrcpbs@prasarbharati.gov.inకు ఈ మెయిల్ చేయవచ్చు.

Spring Season: వసంతకాలం పరిమళాలు వెదజల్లే కాలం.. అందమైన ప్రదేశాలని చూస్తే మనసుకి కొత్త ఉత్సాహం..?

Kawasaki: సరికొత్త బైక్‌ని విడుదల చేసిన కవాసకి.. ధర, ఫీచర్లు అదిరిపోయాయి..?

Cigarette Addiction: సిగరెట్‌ మానలేకపోతున్నారా.. ఇలా చేస్తే బయటపడటం సులువు..!