- Telugu News Photo Gallery If you have cigarette addiction then try these home remedies it will be easy to quit addiction
Cigarette Addiction: సిగరెట్ మానలేకపోతున్నారా.. ఇలా చేస్తే బయటపడటం సులువు..!
Cigarette Addiction: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో పొగాకు ఒకటి. సిగరెట్ కాల్చడం, పొగాకు నమలడం రెండూ ఆరోగ్యానికి చాలా హానికరం. ఒక్కసారి వీటిని తీసుకోవడం మొదలుపెడితే ఎప్పుడు దానికి బానిస అవుతారో కూడా అర్థం కాని పరిస్థితి దాపురిస్తుంది.
Updated on: Feb 02, 2022 | 4:54 PM

అన్నింటిలో మొదటిది సిగరెట్‌కి ఎందుకు బానిసయ్యారో తెలుసుకోండి. వాస్తవానికి సిగరెట్‌లలో నికోటిన్ ఉంటుంది దీని ప్రభావం శరీరంపై 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దాని ప్రభావం తగ్గిన వెంటనే ఆ వ్యక్తి దానిని మళ్లీ తాగాలని అనుకుంటాడు. ఈ వ్యవహారంలో ఆ వ్యక్తి తనకు తెలియకుండానే దానికి బానిసవుతాడు.

మీరు సిగరెట్ లేదా పొగాకు మానేయాలని నిర్ణయించుకున్నట్లయితే కొద్దిగా పాలు తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఖచ్చితంగా వింతగా అనిపిస్తుంది కానీ పాలు మీ కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది.

మీరు నారింజ, సీజనల్ పండ్లు, అరటి, జామ, కివి, స్ట్రాబెర్రీ మొదలైన విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవచ్చు. ఇవి సిగరెట్ కాల్చాలనే కోరికలను తగ్గిస్తాయి.

పచ్చి పనీర్ ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరమైనది. దీనిని తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. పొగాకు లేదా సిగరెట్ కాల్చాలని అనిపించినప్పుడల్లా కొన్ని పచ్చి పనీర్ ముక్కలను తింటే కోరిక తగ్గుతుంది.

పొగాకు నమిలి తినే అలవాటు ఉన్నవారు సోంపు తినడం అలవాటు చేసుకోవాలి. మీకు పొగాకు తినాలని అనిపించినప్పుడల్లా ప్రత్యామ్నాయంగా సోంపు తినండి. ఇది మీ జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది మీ వ్యసనాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది.



