AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahrukh Khan: ఈ మ్యాచ్‌ ఫినిషర్ అంటే షారుక్‌కి ఆరాధ్య దైవం.. టీమిండియా జెర్సీ ధరించడానికి రెడీ..

Shahrukh Khan: ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే తర్వాత ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ కూడా జరగనుంది. ఈ రెండు సిరీస్‌లకు

Shahrukh Khan: ఈ మ్యాచ్‌ ఫినిషర్ అంటే షారుక్‌కి ఆరాధ్య దైవం.. టీమిండియా జెర్సీ ధరించడానికి రెడీ..
Shahrukh Khan
uppula Raju
|

Updated on: Feb 02, 2022 | 9:39 PM

Share

Shahrukh Khan: ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే తర్వాత ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ కూడా జరగనుంది. ఈ రెండు సిరీస్‌లకు గత నెలలోనే టీమిండియాను ప్రకటించారు. అయితే అందులో ఒక పేరు కోసం అందరు ఎదురు చూస్తున్నారు. అది తమిళనాడు దూకుడు బ్యాట్స్‌మెన్ షారుక్ ఖాన్. దేశీయ సర్క్యూట్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా షారుఖ్‌కు మ్యాచ్‌లను ఫినిషింగ్‌ చేయగలడు. షారుఖ్ మాట్లాడుతూ “నేను చాలా సంతోషంగా ఉన్నాను. సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలిగాను. మీరు నన్ను ఒక సంవత్సరం క్రితం అడిగి ఉంటే నేను సిద్ధంగా లేనని చెప్పేవాడిని కానీ ఇప్పుడు మీరు అడిగితే నేను టీమ్ ఇండియా జెర్సీకి సిద్ధంగా ఉన్నానని చెప్పగలను. జట్టులో భాగమైనందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు. 26 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ మ్యాచ్ సమయంలో ఒత్తిడి గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని తనకు వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయమే ముఖ్యమని చెప్పాడు.

“మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా పేస్‌ని ఎలా మార్చాలో నాకు తెలుసు. నేను ఎల్లప్పుడూ నా బృందం కోసం ఆ పని చేయాలనుకుంటున్నాను. క్రీజులో ఉన్నప్పుడు ఒత్తిడిని నాపై పడనివ్వను. జట్టు గురించి కాకుండా సొంత ప్రదర్శన గురించి ఆలోచిస్తే ముఖంలో ఒత్తిడి కనిపిస్తుంది. నేను ఎప్పుడూ నా టీమ్‌ను ముందు ఉంచుతాను. అందుకే నేనెప్పుడూ ఒత్తిడికి గురికాను’’ అన్నాడు. ముఖ్యంగా ఫినిషింగ్ స్టైల్‌ కారణంగా షారుక్‌ని బాగా ఇష్టపడుతున్నారు. గతేడాది ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున అతను చివరి ఓవర్లలో దూకుడు ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదేవిధంగా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలలో కూడా ఈ బ్యాట్స్‌మన్ జట్టు కోసం మ్యాచ్‌లను ముగించాడు. మాజీ వెటరన్ కెప్టెన్ ధోనీలా జట్టుకు ‘ఫినిషర్’గా పనిచేయాలని షారుక్ భావించడానికి ఇదే కారణం.

SBI PO Interview Letter 2022: ఎస్బీఐ పీవో ఇంటర్వ్యూ లెటర్ విడుదల.. 2056 పోస్టుల భర్తీ..

Prasar Bharati Jobs 2022: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. జీతం 40 వేల నుంచి 50 వేల వరకు..?

హెచ్చరిక.. 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా..?