హెచ్చరిక.. 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Sleep Less: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌ను గడుపుతున్నారు. ఎక్కువ పని ఒత్తిడి కారణంగా ప్రజలు నిద్రపై రాజీ పడుతున్నారు.

హెచ్చరిక.. 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా..?
Sleep
Follow us
uppula Raju

|

Updated on: Feb 02, 2022 | 6:54 PM

Sleep Less: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌ను గడుపుతున్నారు. ఎక్కువ పని ఒత్తిడి కారణంగా ప్రజలు నిద్రపై రాజీ పడుతున్నారు. కానీ మీరు చాలా కాలం పాటు నిరంతరంగా నిద్రతో రాజీ పడుతుంటే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. నిద్ర లేకపోవడం అనేది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. తక్కువ గంటల నిద్ర జ్ఞాపకశక్తితో పాటు జీవక్రియ, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. ఎక్కువ కాలం నిద్ర లేకపోవడం వల్ల ప్రజలలో ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే ప్రతిరోజూ ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోకూడదు. ఇంతకంటే తక్కువ నిద్ర ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తక్కువ నిద్ర కారణంగా ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసే సామర్థ్యం, ఇన్ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యం, అనేక శారీరక ప్రక్రియలు కూడా ప్రభావితమవుతాయి. నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. చాలా మంది రాత్రిపూట సరిగ్గా నిద్రపోనందున ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటారు. ఇదే కాకుండా గుండె, క్యాన్సర్, బీపీ వ్యాధుల బారిన పడుతారు.

ప్రజలు వివిధ మార్గాల్లో నిద్రపోతారు. కొందరు పనిని పూర్తి చేయడానికి నిద్రతో రాజీపడతారు. కొందరు పని చేసే షిఫ్ట్ కారణంగా నిద్రను సమతుల్యం చేసుకుంటారు. కొంతమంది పర్యావరణం కారణంగా తక్కువ నిద్రపోతారు. పని కారణాల వల్ల మీరు నిరంతరం 8 గంటల నిద్రను పొందలేకపోతే మీరు దానిని తక్కువ వ్యవధిలో పూర్తి చేయవచ్చు. దీంతో మీరు 8 గంటల నిద్రను పూర్తి చేయవచ్చు. ప్రధానంగా 4, 5 గంటలు నిద్రపోతున్నట్లయితే మీరు మధ్యాహ్నం ఒక గంట లేదా రెండు గంటల నిద్రతో మిగిలిన నిద్రను భర్తీ చేసుకోవచ్చు. చిన్న నిద్ర ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది.

Cigarette Addiction: సిగరెట్‌ మానలేకపోతున్నారా.. ఇలా చేస్తే బయటపడటం సులువు..!

Kawasaki: సరికొత్త బైక్‌ని విడుదల చేసిన కవాసకి.. ధర, ఫీచర్లు అదిరిపోయాయి..?