Signs of Cancer: ఈ ఏడు లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, మహిళలు వీటిని అస్సలు విస్మరించకూడదు..!
Signs of Cancer: ఏటా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
Signs of Cancer: ఏటా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. క్యాన్సర్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ప్రారంభంలోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ లక్షణాలు, సంకేతాలను ముందుగానే గ్రహించి చికిత్స తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చునని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతుంటారు. గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వస్తుంటుంది. బెంగళూరులోని ఫోర్టీస్ లా ఫెమ్మె హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గీత్ మొన్నప్ప.. మహిళల్లో కనిపించే క్యాన్సర్ లక్షణాలు, చికిత్సపై కీలక విషయాలు చెప్పారు. ముఖ్యంగా మహిళలు తమలో ఈ 7 లక్షణాలు కనిపిస్తే విస్మరించకూడదని హెచ్చరించారు. మరి ఆ 7 లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రొమ్ము క్యాన్సర్.. రొమ్ము క్యాన్సర్ మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి సంవత్సరం 2.1 మిలియన్ల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రొమ్ములో ఆకస్మిక మార్పులు సంభవించడాన్ని అస్సలు విస్మరించకూడదు. అది రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణం కావొచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే.. రొమ్ము, చంకలో నొప్పిలేని గడ్డలు ఏర్పడుతాయి. రొమ్ము చర్మంపై మార్పులు వస్తాయి. చనుమొనల నుంచి రక్తస్త్రావం అవుతుంది.
ఎక్కువ కాలం రక్తస్త్రావం అవడం.. ఒక వారం కంటే ఎక్కువ రక్తస్రావం, మునుపటి సైకిల్స్‌తో పోల్చితే అధిక రక్తస్రావం వంటి సమస్యలు వస్తే వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి.
క్రమరహిత రక్తస్రావం.. లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం, పీరియడ్స్ ముగిసిన తరువాత రక్తస్త్రావం అవడం గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
మెనోపాజ్ తర్వాత రక్తస్రావం.. ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం జరిగినట్లయితే, ఇది గర్భాశయ క్యాన్సర్ మొదటి లక్షణం కావచ్చు. ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించకూడదు. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
పీరియడ్స్ సమయంలో పేయిన్స్.. డిస్మెనోరియా, బాధాకరమైన పీరియడ్స్ కొన్నిసార్లు గర్భాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. అయితే ఇది తరచుగా రక్తస్రావం అవడం వల్ల కూడా పెయిన్ వస్తుంటుంది. ఎందుకైనాసరే వైద్యులను చూపించుకోవడం మంచిది.
దుర్వాసన.. యోని ఇన్ఫెక్షన్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వస్తుంటుంది. దుర్వాసనతో కూడిన యోగి ఉత్సర్గ క్యాన్సర్‌కు కారణమవుతుంది. దీనిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
ఉదర సమస్యలు.. కడుపు ఉబ్బరం, బరువు క్షీణత వంటి నిర్ధిష్ట లక్షణాలు అండాశయ క్యాన్సర్ లక్షణాలుగా పేర్కొంటున్నారు నిపుణులు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ద్వారా స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. ముందస్తుగా క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం ద్వారా చికిత్స చాలా ఈజీ అవుతుంది. లేదంటే చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది.
Also read:
TV9 Digital News Round Up: వచ్చే నెల 11న రాధేశ్యామ్ | శ్రీవల్లి పాటకు బామ్మ డాన్స్..(వీడియో)
Mamata Banerjee: జాతీయ గీతాన్ని అవమానించిన ముఖ్యమంత్రి.. మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లుజారీ..!