Health Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు. దీనికి కారణం నోరు శుభ్రంగా లేకపోవడమే..
చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు. దీనికి కారణం నోరు శుభ్రంగా లేకపోవడమే.. నోరు శుభ్రంగా పంటి నొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ధరి చేరవు. అందుకే నోరు శుభ్రంగా ఉండటం తప్పనిసరి. నోటి శుభ్రత లేకుంటే చిగుళ్ల నొప్పి, పంటి నొప్పి, పళ్ల నుంచి రక్తం కారటం, పళ్లు పుచ్చుపట్టిపోవటం వంటి సమస్యలను ఎదురవుతాయి.
ఎప్పుడైనా ఆహారం తిన్న తర్వాత నోటి శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ముఖ్యం స్వీట్ తిన్నప్పుడు తప్పుకుండా నోటిని శుభ్రం చేసుకోవాలి లేకుంటే పంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పంటి నొప్పి వస్తే కొన్ని చిట్కాలు పాటిస్తే తగ్గిపోతుంది. అదేమిటంటే.. ఉత్తరేణి పుల్లతో పళ్లు తోముకుంటే పళ్లు శుభ్రపడి రోగాలు రావు. మఱ్ఱి ఊడలతో పళ్లు తోముకుంటే కదిలే పళ్లు సైతం గట్టిపడతాయి. ఉప్పు, ఉల్లిపాయ నూరి దాన్ని పళ్లకు రుద్దితే పళ్ల వెంట కారుతున్న రక్తం ఆగిపోతుంది. పళ్లను కుంకుడు కాయ నురుగుతో రుద్దితే పళ్లు తళతళ మెరుస్తాయి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి
Read Also.. Health Tips: వీటిని పచ్చిగా తింటే చాలా ప్రమాదం.. మర్చిపోయి కూడా ఇలా చేయకండి..!