High cholesterol: ఈ చాక్లెట్ బార్ తింటే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరిగిపోవాల్సిందే.. పూర్తివివరాలివే..
High cholesterol: అధిక కొలెస్ట్రాల్ అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తుంది.
High cholesterol: అధిక కొలెస్ట్రాల్ అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తుంది. అందుకే చాలామంది తమ శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి స్టాటిన్స్ అనే మందులను వినియోగిస్తుంటారు. అయితే, ఒక చాక్లెట్ బార్ శరీరంలోని కొవ్వును కరిగిస్తుందని, ట్యాబ్లెట్స్ వాడాల్సిన పనిలేదని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. అధ్యయన నివేదికలు కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తున్నాయి.
కొవ్వు పదార్థాలు అధికంగా తినడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అయితే, ఈ సమస్య నుంచి బయటపడాలంటే మంచి జీవన శైలిని అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్‌కి సంబంధించిన విషయంలో నియంత్రణలు పాటించం మంచిది. అయితే, జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. నిర్దిష్ట ఆహారం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దివ్యౌషధంగా పని చేస్తుందని తేల్చారు.
‘‘చాలామంది వైద్యులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం కోసం మందులను (స్టాటిన్స్ వంటివి) రిఫర్ చేస్తుంటారు. అయితే, ఈ అధ్యయనం మాత్రం కొలెస్ట్రాల్ ప్రభావితమైన మిలియన్ల మంది అమెరికన్లకు – ముఖ్యంగా మందుల దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందేవారికి సమర్థవంతమైన ఆహార-ఆధారిత ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుంది.’’
అధ్యయనం ప్రకారం.. వాల్‌నట్స్‌తో తయారు చేసిన చాక్లెట్ బార్స్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయట. వాల్‌నట్స్ కొలెస్ట్రాల్‌ను అదుపులోకి ఉంచుతాయి. ఇందులో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అంతేకాదు.. ఈ చిరుతిళ్లు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయట. ఎందుకంటే వాటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వాల్‌నట్ చాక్లెట్స్‌లో పీచుపదార్థం ఉంటుంది. ఇవి పేగు నుంచి రక్తప్రవాహంలోకి శోషించబడే కొలెస్ట్రాల్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.
ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి చాక్లెట్ బార్‌లను మాత్రమే కాకుండా స్మూతీస్ వంటి ఇతర స్నాక్స్‌ను కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్ల మిశ్రమాన్ని కలిగి ఉండే స్నాక్స్‌ని ప్రత్యేకంగా తయారు చేసి వారికి ఇచ్చారు పరిశోధకులు. అధ్యయనంలో పాల్గొనే వారు ఇప్పటికే తింటున్న వాటి స్థానంలో ఈ చిరుతిళ్లను తినాలని సూచించారు. ఇతర ముఖ్యమైన జీవనశైలిలో మార్పులు చేయవద్దని కూడా సూచించారు. 30 రోజుల పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్నాక్స్‌ను రోజుకు రెండుసార్లు తిన్నారు. ఇలా 30 రోజులు చేయగా.. దాదాపు అందరిలో 9 శాతం కొలెస్ట్రాల్ తగ్గింది. కొంతమందిలో 30 శాతం కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గినట్లు గుర్తించారు. అయితే, కిరాణ ఉత్పత్తులను తినిపించి చూస్తే.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, అధ్యయనంలో కొలెస్ట్రాల్ తగ్గించే స్నాక్స్‌ను స్టెప్ వన్ ఫుడ్స్ అనే అమెరికన్ కంపెనీ ఉత్పత్తి చేసింది.
Also read:
Rahul Gandhi: పార్లమెంట్ వేదికగా కేంద్రం దుమ్ము దులిపిన రాహుల్ గాంధీ.. ఏఏ అంశాలపై నిలదీశారంటే..
Health Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
Be Alert: ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్.. డీపీగా అమ్మాయి ఫోటో..