Be Alert: ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్.. డీపీగా అమ్మాయి ఫోటో..
Be Alert: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, పబ్లిక్ సర్వెంట్లను కూడా వదలడం లేదు.
Be Alert: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, పబ్లిక్ సర్వెంట్లను కూడా వదలడం లేదు. పబ్లిక్ సర్వెంట్లు, ప్రజాప్రతినిధుల పేర్లో అమాయలకు టోకరా వేస్తున్నారు. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేశారు కేటుగాళ్లు. ఆ ఎఫ్‌బీ డీపీగా ఒక అమ్మాయి ఫోటోను పెట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి చేరడంతో ఆయన అలర్ట్ అయ్యారు. తన అనుచరులందరినీ అప్రమత్తం చేశారు. ‘‘నా పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త ఫేస్ బుక్ ఐడీ క్రీట్ చేశారు. ఈ ఫేస్ బుక్ డీపీ గా అమ్మాయి ఫోటో పెట్టారు. అలాగే కొన్ని తప్పుడు ఫోటోలు పెట్టి నా పేరును డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు నేను దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. నా పేరుతో కొత్తగా క్రియేట్ చేసిన ఫేస్ బుక్ ఐడీ నాది కాదు. ప్రజలు ఎవరూ మోసపోవద్దు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.’’ అని జగ్గారెడ్డి క్లారిటీ ఇవ్వడంతో పాటు ప్రజలను అలర్ట్ చేశారు.
Also read:
జనవరి 2022లో అత్యధిక అమ్ముడైన కార్లు ఇవే.. మారుతి సుజుకి వ్యాగన్ R నెంబర్ వన్
Indian cricketers : టీమిండియా క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ .. ఆందోళనలో అభిమానులు
Telangana Mutual Transfers: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ సర్కార్.. జీవో జారీ..