జనవరి 2022లో అత్యధిక అమ్ముడైన కార్లు ఇవే.. మారుతి సుజుకి వ్యాగన్ R నెంబర్ వన్

Top 10 Cars January: జనవరి 2022లో మారుతి సుజుకి వ్యాగన్ R మొత్తం 20,334 యూనిట్లు విక్రయాలు జరిపి భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా

జనవరి 2022లో అత్యధిక అమ్ముడైన కార్లు ఇవే..  మారుతి సుజుకి వ్యాగన్ R నెంబర్ వన్
Cars
Follow us
uppula Raju

|

Updated on: Feb 02, 2022 | 10:30 PM

Top 10 Cars January: జనవరి 2022లో మారుతి సుజుకి వ్యాగన్ R మొత్తం 20,334 యూనిట్లు విక్రయాలు జరిపి భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ ఏడాది ప్రాతిపదికన 18.4 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. మారుతి స్విఫ్ట్ 19,108 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. 11.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. తర్వాత మారుతి డిజైర్ మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో అమ్మకాలు 1.0 శాతం క్షీణించాయి. 14,967 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. టాటా నెక్సాన్ జనవరి 2022 సేల్స్ చార్ట్‌లో 13,816 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని పొందింది. ఇది ఏడాది ప్రాతిపదికన అమ్మకాలలో 67.9 శాతం వృద్ధిని సాధించింది.

మారుతి సుజుకి ఆల్టో ఐదో స్థానంలో ఎర్టిగా ఆరో స్థానంలో ఉన్నాయి. ఈ రెండూ వరుసగా 12,342 యూనిట్లు, 11,847 యూనిట్ల విక్రయ గణాంకాలతో ఉన్నాయి. జనవరి 2022లో కియా సెల్టోస్ మొత్తం 11,483 యూనిట్ల అమ్మకాలతో ఏడో స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత, హ్యుందాయ్ వెన్యూ 11,377 యూనిట్ల అమ్మకాల సంఖ్యను సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. మారుతి Eeco మొత్తం 10,528 యూనిట్లను విక్రయించి తొమ్మిదో స్థానంలో ఉంది. 10,027 యూనిట్ల అమ్మకాల సంఖ్యను సాధించిన టాటా పంచ్ పదో స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లను కలిగి ఉంది. అయినప్పటికీ టాటా మోటార్స్ తన అమ్మకాల పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. జనవరి 2022లో నెక్సాన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV, టాటా పంచ్ అమ్మకాలలో కూడా చాలా విజయాన్ని సాధించింది. మారుతీ ఎర్టిగా జనవరి 2022లో భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన MPVగా నిలిచింది. కియా సెల్టోస్ గత నెలలో మన దేశంలో అత్యధికంగా అమ్ముడైన మధ్యతరహా MPV. హ్యుందాయ్ క్రెటా, మారుతి విటారా బ్రెజ్జా టాప్ 10 జాబితాలోకి రావడంలో విఫలమయ్యాయి.

ఈ శ్రీలంక పేసర్ రిటైర్మెంట్ ప్రకటించాడు‌.. టీమిండియాపైనే అరంగ్రేటం.. టీమిండియాతోనే ముగింపు..

Shahrukh Khan: ఈ మ్యాచ్‌ ఫినిషర్ అంటే షారుక్‌కి ఆరాధ్య దైవం.. టీమిండియా జెర్సీ ధరించడానికి రెడీ..

SBI PO Interview Letter 2022: ఎస్బీఐ పీవో ఇంటర్వ్యూ లెటర్ విడుదల.. 2056 పోస్టుల భర్తీ..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?