AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: పార్లమెంట్ వేదికగా కేంద్రం దుమ్ము దులిపిన రాహుల్ గాంధీ.. ఏఏ అంశాలపై నిలదీశారంటే..

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ

Rahul Gandhi: పార్లమెంట్ వేదికగా కేంద్రం దుమ్ము దులిపిన రాహుల్ గాంధీ.. ఏఏ అంశాలపై నిలదీశారంటే..
Rahul Gandhi
Shiva Prajapati
|

Updated on: Feb 02, 2022 | 11:02 PM

Share

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. దేశ యువత జీవితాలతో చెలగాటమాడుతోంది బీజేపీ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. పేదల ప్రజల బ్రతుకులను నిర్వీర్యం చేస్తూ.. ధనవంతుల కొమ్ముకాస్తోందంటూ ఫైర్ అయ్యారు. బుధవారం నాడు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రభుత్వం న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్ స్పైవేర్‌లను ‘‘రాష్ట్రాల యూనియన్‌ లక్ష్యాన్ని నాశనం చేసే సాధనాలు’’గా ఉపయోగిస్తోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు.. చైనా-పాకిస్తాన్ దేశాలను దగ్గర చేయాలని అన్నారు. ఇంటా, బయటా భారత్‌కు ప్రమాదం పొంచి ఉందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోతోందన్నారు. దేశంలో సంపన్నులకు, సామాన్య ప్రజలకు మధ్య అగాధం గురించి రాష్ట్రపతి ప్రసంగంలో లేదని, ఇదే అసలైన విషయం అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు రెండు భారత దేశాలు ఉన్నాయి. ఒక భారతదేశం.. అత్యంత ధనవంతుల కోసం, అపారమైన సంపద, అధికారంతో, ఉద్యోగం, నీటి కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ అవసరం లేని వారికోసం.. మరొక భారతదేశం పేద ప్రజల కోసం.’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ రెండు భారతదేశాల మధ్య విభజన పెరుగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 40 కోట్ల మంది భారతీయుల సంపదకు సమానమైన సంపద కేవలం 10 మంది భారతీయుల వద్ద ఉందని అన్నారు. ఇది కేవలం నరేంద్ర మోదీ వల్లే సాధ్యమైంటూ సంచలన ప్రకటన చేశారు. దేశంలో నిరుద్యోగ స్థాయి గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉందన్నారు. ‘‘మీరు మేడ్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా గురించి మాట్లాడతారు. కానీ, యువత వారు అనుకున్న ఉద్యోగం రాలేదు. పైగా వారి ఎదుల నిరుద్యోగం తాండవిస్తోంది.’’ అని కేంద్రం విధానాలను తూర్పారబట్టారు. కేవలం 2021 లోనే 3 కోట్ల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువస్తే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం 23 కోట్ల మందిని మళ్లీ పేదరికంలోకి నెట్టేసిందని దుయ్యబట్టారు.

ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్, కింగ్‌డమ్ కాదు.. మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని సుస్థిరం చేస్తోందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యాంగం ప్రకారం భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని, దానిని ‘రాజ్యం’గా పరిపాలించలేమని అన్నారు. భారతదేశం వివిధ భాషలు, సంస్కృతుల సమ్మేళనం అని అన్నారు. ఫెడరలిజం, వాక్ స్వాతంత్ర్యం, డిబేట్స్ ప్రాముఖ్యతను రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు. 1947లో కాంగ్రెస్ పార్టీ రాజ్యం అనే ఆలోచనను తుంగలో తొక్కిందని, ఇప్పుడు బీజేపీ పాలనలో ఆ భావన వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం దండించడం ద్వారా పాలించవచ్చు అనే దృక్పథంలో ఉందని విమర్శించారు. ‘‘న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్’’ ఇవన్నీ రాష్ట్రాల యూనియన్ గొంతును నాశనం చేసే సాధనాలగా కేంద్రం వాడుకుంటోందంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ప్రమాదంలో దేశం.. భారతదేశానికి బయటి నుంచి లోపలి నుంచి ప్రమాదం పొంచి ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చైనా-పాకిస్తాన్ కూటమి నుంచి దేశానికి ముప్పు ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు భారతదేశ పునాదులతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. దేశంలోని సంబంధాలను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. సరిహద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనేక వ్యూహాత్మక తప్పిదాలు చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు.

Also read:

Health Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Be Alert: ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్.. డీపీగా అమ్మాయి ఫోటో..

జనవరి 2022లో అత్యధిక అమ్ముడైన కార్లు ఇవే.. మారుతి సుజుకి వ్యాగన్ R నెంబర్ వన్