Health Tips: వీటిని పచ్చిగా తింటే చాలా ప్రమాదం.. మర్చిపోయి కూడా ఇలా చేయకండి..!

పచ్చి గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటారు. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా గుడ్డులో ఉంటుంది. ఇది వేడి చేయడం ద్వారా చస్తుంది.

Health Tips: వీటిని పచ్చిగా తింటే చాలా ప్రమాదం.. మర్చిపోయి కూడా ఇలా చేయకండి..!
Health Tips
Follow us

|

Updated on: Feb 02, 2022 | 12:07 PM

Health Tips: మన శరీరానికి ఆహారం(Healthy Food) చాలా ముఖ్యం. శరీర బలం కోసం పోషకాలు కూడా చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తమకు తెలియకుండానే ఏదేదో తింటుంటారు. సగం ఉడికిన ఆహారం, ముఖ్యంగా కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ, పచ్చిగా (Raw Vegetables)తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలిగించే అనేక ఆహారాలు ఉన్నాయి. పచ్చిగా తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రకోలీ: బ్రకోలీ ఒక క్రూసిఫెరస్ వెజిటేబుల్. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది తమ ఫిట్‌నెస్‌ను సరిగ్గా ఉంచుకోవడానికి దీనిని తింటుంటారు. చాలా మంది దీనిని సగం ఉడికిస్తారు. కానీ, సగం ఉడికిన తర్వాత తినడం చాలా ప్రమాదకరం. అందుకే పూర్తిగా ఉడికించి తినడానికి ప్రయత్నించండి.

గుడ్లు: పచ్చి గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వండటం ద్వారా చనిపోతుంది. కానీ, గుడ్డు పచ్చిగా తింటే, అది విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందుకే గుడ్లు ఉడికించి తినడం మంచిది.

టొమాటోలు: టొమాటోలను తరచుగా సలాడ్లలో ఉపయోగిస్తారు. అనేక కూరగాయలతో కలిపి వీటిని తింటుంటారు. చాలా మందికి టమోటాలు వండకుండా తినడం అలవాటు. కానీ, టమోటాలు ఉడికించి తినాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. టొమాటోల నుంచి లైకోపీన్ విడుదల అవ్వాలంటే దానిని వండాల్సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

బచ్చలికూర: ఐరన్, క్యాల్షియం, ఫైబర్ అధికంగా ఉండే మూలాలలో బచ్చలికూర ఒకటి. కానీ, తినడానికి ముందు దానిని వేడిచేయడం చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా, అవసరమైన పోషకాలను గ్రహించడం సులభం అవుతుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు, వైద్యుడిని సంప్రదించండి.

Also Read: Rice Side Effects: రోజూ మూడు పూటలు అన్నం తింటున్నారా ? దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి..

Spinach Side Effects: చలికాలంలో బచ్చలికూరను తింటే పెద్ద ప్రమాదమే.. ఎందుకో తెలుసా..