Cucumber Water: బరువు తగ్గాలనుకుంటున్నారా రోజూ.. దోసకాయ వాటర్‌ని తాగండి.. తయారీ ఇలా.

Cucumber Water: దోసకాయలు(Cucumber)కూరగా చేసుకుని తినవచ్చు.. కొన్ని రకాల దోసకాయలు ముక్కగా కట్ చేసి.. షుగర్ వేసుకుని తినవచ్చు.. ఎలా ఆహారంగా తీసుకున్నా దోసకాయల వల్ల అనేక ప్రయోజనాలు..

Cucumber Water: బరువు తగ్గాలనుకుంటున్నారా రోజూ.. దోసకాయ వాటర్‌ని తాగండి.. తయారీ ఇలా.
Yellow Cucumber Water
Follow us
Surya Kala

|

Updated on: Feb 02, 2022 | 3:47 PM

Cucumber Water: దోసకాయలు(Cucumber)కూరగా చేసుకుని తినవచ్చు.. కొన్ని రకాల దోసకాయలు ముక్కగా కట్ చేసి.. షుగర్ వేసుకుని తినవచ్చు.. ఎలా ఆహారంగా తీసుకున్నా దోసకాయల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులోను పందిరి దోసకాయ వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. దోసకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, విటమిన్ కె , పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు దోసకాయ పానీయాలు(Cucumber Water)కేలరీలతో నిండి ఉంటాయి.  దోసకాయ నీటిని రోజూ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు దోసకాయ వాటర్ తయారీ.. ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. దోసకాయ పానీయం తయారీ విధానం: ఈ దోసకాయ నీటిని తయారు చేయడం చాలా సులభం. దోసకాయను ముక్కలు చేసి ఒక గాజు గ్లాసులో వేసుకుని తగినంత నీరు పోసుకుని రాత్రిపూట నానబెట్టాలి.  ఉదయం అయ్యేసరికి దోసకాయ నీరు రెడీగా ఉంటుంది.  ఈ నీరు రోజూ ఉదయం తాగడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం బరువు తగ్గుదలకు మంచి ఔషధం. ఎందుకంటే పందిరి దోస ఫైబర్ కలిగి ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తినడం కష్టం. కొంచెం తింటే చాలు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. వీటిని కనుక తింటే మీరు బరువు పెరగకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక దోసకాయ.

దోసకాయ నీరు ఆరోగ్య ప్రయోజనాలు:  *ఈ నీరు ఎముకలు ధృఢంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన ఎముక కణజాల అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్లను ఇస్తుంది. *దీనిలోని విటమిన్ కె శరీరంలోని రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. రక్తం గడ్డకట్టడం ద్వారా గాయం తర్వాతగా మానేలా చేస్తుంది. * శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తుంది. దోసకాయ నీరు తాగడం వలన జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో అద్భుతాలు చేస్తుంది. *సహజమైన నీటిలో ఎటువంటి ఖనిజాలు, విటమిన్లు లేవు. అయితే ఈ నీటికి దోసకాయ జత కలిపినప్పుడు.. నీరు పోషకాలను ఇచ్చేదిగా మారుతుంది. *దోసకాయలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో  గుండె సమస్యలను నివారిస్తుంది.  మూత్రపిండాల సమస్యలను కూడా దోసకాయ నీటి సహాయంతో దూరంగా ఉంచవచ్చు. *దోసకాయలో మంచి మొత్తంలో సిలికా కంటెంట్ ఉంటుంది. ఈ దోసకాయ నీరు అంతర్గతంగా మెరుస్తున్న చర్మాన్ని అందిస్తుంది. అంతేకాదు ఇలా నీటిలో నానబెట్టిన దోసకాయను చర్మంపై అప్లై చేయడం వలన మొటిమలను తగ్గిస్తుంది. *దోసకాయ నీరు బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ఆకలి వేయకుండా చేస్తుంది. * దోసకాయలో కుకుర్బిటాసిన్ అధికంగా ఉంది. అలాగే, ది అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. దోసకాయ నీటిని రోజూ తగినంతగా తీసుకోవడం వల్ల మూత్ర క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గువని తెలుస్తోంది. *దోసకాయ నీరు తగినంతగా తీసుకోవడం వల్ల వయస్సు వల్ల ఏర్పడిన చర్మం ముడుతలను తగ్గించి.. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మం పై ఎటువంటి మచ్చలు లేకుండా చేస్తుంది. *దోసకాయ నీటిలో ఫిసెటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెమరీ శక్తిని పెంచే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మెదడు శక్తివంతంగా ఉంటుంది.

అనేక ప్రయోజనాలు కలిగే దోసకాయ నీటిని మీ రెగ్యులర్  డైట్ లో చేర్చి ఆరోగ్యంగా ఉండండి.

(Note:  ఈ దోసకాయ నీటిని తాగే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం)

Also Read:

గుండెల్లో మంట చిటికెలో దూరం.. వంటింటి చిట్కాలు మీ కోసం..