Spinach Side Effects: చలికాలంలో బచ్చలికూరను తింటే పెద్ద ప్రమాదమే.. ఎందుకో తెలుసా..
తమిళ్ స్టార్ హీరో సూర్య (Suriya) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న కథాంశలను
సాధారణంగా ఆకు కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఆకు కూరలలో ఎన్నో పోషకాలుంటాయి. అందులో పాలకూర మన ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. దీంతోపాచు.. బచ్చలి కూర కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బచ్చలి కూర ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. ఎముకలను బలోపేతం చేస్తుంది. అందుకే చాలా మంది బచ్చలి కూరను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. బచ్చలి కూరను కేవలం వంటకంగానే కాకుండా స్మూతీగా.. ఆమ్లెట్ ద్వారా.. పప్పు, బజ్జీలు ఇలా ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. కానీ చలికాలంలో బచ్చలి కూరను అసలు తినకూడదు. ఎందుకో తెలుసుకుందామా.
బచ్చలికూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇందులో ఆక్సాలిక్ యాసిడ్ మొక్కలలో సహజంగా లభించే మూలకం. ఇది శరీరంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. అది ఇతర ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో శరీరంలో ఖనిజాల లోపానికి దారితీస్తుంది. రోజులో పాలకూరను ఆధికంగా తీసుకోవడం వలన శరీరం అలసిపోతుంది. అలాగే బచ్చలి కూరను తినడం వలన వ్యక్తి తన శక్తిన కోల్పోవడమే కాకుండా.. నీరసంగా ఉంటాడు. బచ్చలి కూరలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. పీచు ఎక్కువగా ఉండడం వలన బచ్చలి కూరలో గ్యాస్, ఉబ్బరం, తిమ్మిళ్లు వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ పై ప్రభావం చూపిస్తుంది. బచ్చలి కూర వంటి ఆకుపచ్చ వెజిటేబుల్స్ హిస్టమిన్ కలిగి ఉండే అవకాశం ఉంది. హిస్టామిన్ అనేది శరీరంలోని కొన్ని కణాలతో కనిపించే రసాయనం. ఇది అలెర్జీ సమస్యను కల్గిస్తుంది. అలాగే శరీరాన్ని దెబ్బతీస్తుంది.
కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు బచ్చలికూరను తినకూడదు. నిజానికి దీనిని ఎక్కువగా తినడం వలన శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఏర్పడుతుంది. శరీరాన్ని వ్యవస్థ నుంచి బయటకు తీయడం కష్టమవుతుంది. దీంతో కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ రాయి పేరుకుపోతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. కీళ్ల నొప్పితో బాధపడేవారు బచ్చలికూరను అస్సలు తినకూడదు. దీనిని తినడం వలన కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరుగుతుంది. మధుమేహం ఉన్న రోగులు బచ్చలి కూరను అస్సలు తినకూడదు. ఇది రక్తాన్ని పలచగా చేస్తుంది. ఇందుకు సప్లిమేంట్స్ వేసుకునేవారు బచ్చలికూరను తినడం వలన మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
గమనిక.. ఈ సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయం, ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. అమలు చేసేముందు వైద్యులను సంప్రదించాలి.