Radhe Shyam: ప్రభాస్‌తో పోటీకి సై అంటున్న తమిళ్ స్టార్ హీరో.. రాధేశ్యామ్ సినిమాకు పోటీగా సూర్య సినిమా..?

స్టార్ హీరో సూర్య ఇటీవల ఓటీటీలో వరుస విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.. సూర్య గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అయ్యారు. ఆ సమయంలో విడుదలైన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

Radhe Shyam: ప్రభాస్‌తో పోటీకి సై అంటున్న తమిళ్ స్టార్ హీరో.. రాధేశ్యామ్ సినిమాకు పోటీగా సూర్య సినిమా..?
Prabhas
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2022 | 8:55 AM

Suriya: స్టార్ హీరో సూర్య ఇటీవల ఓటీటీలో వరుస విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.. సూర్య గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అయ్యారు. ఆ సమయంలో విడుదలైన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఆ సమయంలోనే సుధ కొంగరు దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీహద్దు రా సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈసినిమా భారీ విజయాన్ని సొంత, చేసుకుంది. ఈ సినిమాలో సూర్య నటనకు మరోసారి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఆలాగే రీసెంట్ గా జై భీమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎత్తారెక్కుమ్ తునిందవన్.

ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈసినిమాలో సూర్య సరసన అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే విదులైన ఈ సినిమా పాటలు, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. ‘ఈటీ’ సూర్య కెరీర్ లో 40వ సినిమా. ఈ మూవీని ముందుగా ఫిబ్రవరి 4న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 10న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ని వదిలారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.  అయితే మార్చి 11 ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో రిలీజ్ కు రెడీగా ఉన్న బడా సినిమాల విడుదల తేదీలను ప్రకటించేశారు. కానీ ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాను మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. అదే కానీ జరిగితే సూర్య , ప్రభాస్ సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

TOP 9 ET News: క్రీడాకారుడిగా ఎన్టీఆర్‌ | RRR అడ్వాన్స్‌ బుకింగ్‌ ఎప్పటినుండి అంటే..(వీడియో)

Nithya Menon: బూరె బుగ్గల బాబ్లీ బ్యూటీ నిత్యామీనన్.. నయా ఫొటోస్ అదుర్స్..

Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!