Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే..

Radhe Shyam Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దాదాపు రెండేళ్లుగా వెండితెరపై కనిపించలేదు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ నుంచి

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే..
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2022 | 10:38 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దాదాపు రెండేళ్లుగా వెండితెరపై కనిపించలేదు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో స్క్రీన్ పై ప్రభాస్‏ను ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ చేతినిండా సినిమాలతో ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారు. చకచకా సినిమాలను కంప్లీట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెబల్ స్టార్. ఇప్పటికే డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా, ఓమిక్రాన్ కారణంగా వాయిదా పడింది.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లుగా డైరెక్టర్ రాధాకృష్ణ పలుమార్లు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని మార్చి 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

Also Read: Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి

Brahmanandam Birthday: సినిమా తెర నుంచి డిజిటల్ పేజీల వరకూ బ్రహ్మాండమంత ఆనందం!

Panja Vaisshnav Tej : మెగా హీరో సినిమానుంచి మూడోవ సినిమా మొదటి సింగిల్ రెడీ అయ్యిందంటా..