Kiran Abbavaram: నా సినిమా విడుదల రోజు కూడా ఆస్టార్ హీరో సినిమాకే వెళ్తాను.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

సినిమా కెరీర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) . వరుస విజయాలు సొంతం చేసుకుని బడా దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడ్డాడు

Kiran Abbavaram: నా సినిమా విడుదల రోజు కూడా ఆస్టార్ హీరో సినిమాకే వెళ్తాను.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..
Kiran Abbavaram
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2022 | 9:25 AM

సినిమా కెరీర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) . వరుస విజయాలు సొంతం చేసుకుని బడా దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడ్డాడు. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కల్యాణమండపం (SR Kalyana Mandapam) సినిమాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ కడప హీరో త్వరలో  ‘సెబాస్టియన్ పి సి 524’ (Sebastian PC 524) తో మరోసారి మనల్ని అలరించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు కిరణ్ అబ్బవరం పుట్టినరోజును పురస్కరించుకుని ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు.  అయితే అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా  నటించిన ‘భీమ్లా నాయక్ (Bheemal Nayak)’ కూడా రిలీజయ్యే అవకాశం ఉంది.  కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రాన్ని పరిస్థితులకు అనుగుణంగా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ‘భీమ్లానాయక్’ సినిమాని విడుదల చేస్తామని ఇటీవల దర్శక నిర్మాతలు ప్రకటించారు.

ఫస్ట్ షో రచ్చ పవర్ స్టార్ మూవీతోనే..

ఈక్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఈ హీరోకు ఓ ఆసక్తికర ప్రశ్న సందించాడు. ‘ ఫిబ్రవరి 25న  ‘భీమ్లా నాయక్’ విడుదల ఉందని మీకు తెలియదా భయ్యా.. ఆరోజే  మీ ‘సెబాస్టియన్ పి సి 524′ ను రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్  అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన మీరు అదే రోజు  మీ సినిమాను విడుదల చేస్తారు.’  అని అడిగాడు.  దీనికి స్పందించిన యంగ్ హీరో ..’నేను మీకంటే కాస్త ఎక్కువగానే ‘భీమ్లా నాయక్’ కోసం ఎదురు చూస్తున్నాను.. ఆరోజు నా సినిమా విడుదల అయినా కూడా.. నేను  పవర్ స్టార్ సినిమాకే మొదటి షో వెళతాను.. ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీ తోనే’.. అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకు తెగ నచ్చేసింది.  సెబాస్టియన్ పి సి 524 తో పాటు ప్రస్తుతం ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణు కథా’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు కిరణ్.

Also Read:Coronavirus: కరోనా బారిన పడిన రజనీకాంత్ కూతురు ఐశ్వర్య.. ఆస్పత్రిలో చికిత్స..

Megastar Chiranjeevi: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అభిమాని కుటుంబానికి ఏం చేశారో తెలుసా?

Mohammad Azharuddin: ఆరోజు ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.. హ్యాట్రిక్ సెంచరీల నాటి మధురానుభవాలను గుర్తు చేసుకున్న అజహరుద్దీన్..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు