Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammad Azharuddin: ఆరోజు ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.. హ్యాట్రిక్ సెంచరీల నాటి మధురానుభవాలను గుర్తు చేసుకున్న అజహరుద్దీన్..

మహ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin).. క్రికెట్ (Cricket) అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. టీమిండియా (Indian Cricket Team) అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరు.  హైదరాబాద్‌కు చెందిన ఈ  మణికట్టు మాంత్రికుడు ఆటగాడిగా, కెప్టెన్ గా భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

Mohammad Azharuddin: ఆరోజు ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.. హ్యాట్రిక్ సెంచరీల నాటి  మధురానుభవాలను గుర్తు చేసుకున్న అజహరుద్దీన్..
Mohammad Azharuddin
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2022 | 8:13 AM

మహ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin).. క్రికెట్ (Cricket) అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. టీమిండియా (Indian Cricket Team) అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరు.  హైదరాబాద్‌కు చెందిన ఈ  మణికట్టు మాంత్రికుడు ఆటగాడిగా, కెప్టెన్ గా భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. మూడు ప్రపంచ కప్‌లలో భారతదేశానికి నాయకత్వం వహించాడు అలా చేసిన ఏకైక భారత కెప్టెన్ కూడా.  అయితే అజహార్ కు సంబంధించి ఇప్పటికీ ఒకే రికార్డు పదిలంగా ఉంది.  ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఆ రికార్డును అందుకోలేకపోయాడు. అదే.. తొలి మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ ఈ హైదరాబాదీ ఆటగాడే విశేషం.  1985లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అరంగేంట్రం చేసిన అతను మొదటి టెస్ట్ లోనే సెంచరీ చేశాడు. ఆ తర్వాత మద్రాస్ తో జరిగిన టెస్ట్ లోనూ మూడంకెల మార్కును చేరుకున్నాడు. తద్వారా బిల్ ఫోన్స్ పోర్డ్, డగ్ వాల్టర్స్, అల్విన్ కల్లి చరణ్ తర్వాత  తొలి రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు బాదిన ఆటగాడిగా రికార్డు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత కాన్పూర్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లోనూ వంద కొట్టేశాడీ హైదరాబాదీ బ్యాటర్. తద్వారా తొలి మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గా క్రికెట్ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించకున్నాడు. కాగా ఈ అరుదైన రికార్డు అందుకుని (ఫిబ్రవరి 1, 1985) 37 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా News9 ఛానెల్ తో అప్పటి అతన తన అనుభవాలను పంచుకున్నాడు అజహర్.

ఆ రోజు త్వరగా నిద్రపోయాను..

‘కాన్పూర్ తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు నేను 98 పరుగులతో నాటౌట్ గా నిలిచాను. అయితే  ఈ రికార్డు గురించి అప్పటివరకు నాకు తెలియదు. ఆరోజు సాయంత్రం అందరూ నా రికార్డు గురించి మాట్లాడతుంటేనే మూడు వరుస సెంచరీల గురించి తెలిసింది. అయితే నేను రికార్డు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు రికార్డుల కంటే టీమిండియాకు ఆడడమే ముఖ్యం. జట్టుకు విజయాలు అందించడమే నా లక్ష్యం. అందుకే మరుసటి రోజు మాములుగానే క్రీజ్ లోకి అడుగుపెట్టాను.  సెంచరీ సాధించాను.  ఇలా నా కెరీర్ మొదటి మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో మూడు వరుస సెంచరీలు చేయడం నా అదృష్టం. ఎందుకంటే అంతకుముందు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో నేను 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాను. అయితే కాన్పూర్ టెస్ట్ లో మాత్రం మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగాను. అప్పటివరకు ఆ స్థానంలో దిలీప్ వెంగ్ సర్కార్ బరిలోకి దిగేవాడు. నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ కు దిగడం పెద్ద బాధ్యత. ఈ స్థానానికి దిలీప్ భాయ్ అద్భుతంగా న్యాయం చేశాడు.  అయితే కాన్పూర్ లో మాత్రం ఆ స్థానంలో నేను బరిలోకి దిగాల్సి వచ్చింది.’

అందుకే నెమ్మదిగా ఆడాను..

‘అప్పటికే ఇంగ్లండ్ జట్టు సిరీస్ లో  2-1 ఆధిక్యంలో ఉంది. దీంతో కాన్పూర్ లో మేం గెలిచి సిరీస్ ను ఎలాగైనా సమం చేయాలనుకున్నాం. అందుకే పట్టుదలతో బ్యాటింగ్ ప్రారంభించాం. కానీ కాన్పూర్ వికెట్ ఫాస్ట్ గా ఉంది. శీతాకాలానికి  తోడు స్టేడియం చుట్టూ చాలా చెట్లు ఉండడంతో  పొగమంచు ఎక్కువగా ఉండేది. కొన్నిసార్లు ఫీల్డింగ్ చేసే సమయంలో బంతి కూడా కనిపించేది కాదు. అయితే అంతకుముందు కలకత్తా టెస్ట్ లోనూ ఇదే తరహా వికెట్ ఉన్నప్పటికీ నేను సెంచరీ సాధించాను.  అందుకే వికెట్ గురించి పట్టించుకోకుండా నా సహజశైలిలో ఆడేందుకు సిద్ధమయ్యాను. మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లు బాగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా ఎడ్మండ్స్ పదునైన బంతులతో కట్డడి చేశాడు.  దీంతో మొదటి రోజు చివరి గంటలో నేను కేవలం 8 పరుగులు మాత్రమే చేశాను. కొంచెం వేగంగా పరుగులు సాధించి ఉంటే మొదటి రోజే ఆ రికార్డు అందుకునేవాడిని’.

ప్రధానమంత్రి  ప్రశంసలు మర్చిపోలేను!

‘ఏదేమైనా ఈ అరుదైన రికార్డు అందుకోవడం నా అదృష్టం.  ఆరోజు నా ఆట చూడడానికి స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.  సెంచరీ పూర్తైన తర్వాత నన్ను అభినందించడానికి మైదానంలోకి చాలామంది అభిమానులు వచ్చారు. ఆ అపురూప క్షణాలను నా జీవితంలో  ఎంతో మధురమైనవి.  అయితే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నన్ను ప్రత్యేకంగా ప్రశంసించడం.  ఆరోజు భోజన విరామ సమయంలో ఆయన ఫోన్ చేసి ‘ చాగా బాగా ఆడారు. మీ ఆటతో ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతున్నారు’ అంటూ నాకు అభినందనలు తెలిపారు. ఆయన నుంచి  ఫోన్ కాల్ నేను అసలు ఊహించలేదు. ఏదేమైనా  ప్రధాని ప్రశంసలను నా జీవితంలో మర్చిపోలేను. ఈ సంఘటన తర్వాత చాలామంది నన్ను ప్రశంసించారు. ఘనంగా సత్కరించారు’. అన్నట్లు ఆరోజు మానాన్న కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ‘బహుత్ అచ్చా ఖేలే బేటా’ అంటూ అభినందించారు’ అని అప్పటి అనుభవాలను గుర్తుకు చేసుకన్నారు అజారుద్దీన్.

అజహరుద్దీన్ లవర్స్ క్లబ్

కాన్పూర్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో అజహరుద్దీన్ 122 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స  లోనూ  54 పరుగులు చేశాడు. అంతకుమందు కలకత్తా, చెన్నై టెస్ట్ ల్లోనూ మూడంకెల మార్కును చేరుకున్నాడు. ఈక్రమంలో మొత్తం సిరీస్ లో 439 పరుగులు చేశాడు. ఓవరాల్ గా 99 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అజహర్ 6215 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి. విశేషమేమిటంటే అతను కాన్పూర్ లో ఆడిన ప్రతి మ్యాచ్ లో వంద కొట్టాడు. 1986 లో ఇదే వేదికపై శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో తన అత్యధిక స్కోరు 199 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ తో జరిగిన  కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ తర్వాత అజహర్ అభిమానుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కాన్పూర్ లో అయితే అతని అభిమానులు  ప్రత్యేకంగా ‘అజహరుద్దీన్ లవర్స్ క్లబ్’ ను ఏర్పాటుచేశారు.’

కాన్పూర్ తో నాకు ప్రత్యేక అనుబంధం! 

‘కాన్పూర్ నాకెంతో ప్రత్యేకం. ఈ మైదానంలో ఆడడాన్ని నేను బాగా ఆస్వాదిస్తాను. ఇక్కడ ఆడిన ప్రతిసారి నేను భారీ స్కోరు సాధించాను. ఇక్కడి అభిమానులు కూడా నన్ను బాగా అభిమానిస్తారు. అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకున్నప్పుడు ఇక్కడి అభిమానులు పిలిచి మరీ నన్ను సత్కరించారు’ అని చెప్పుకొచ్చారు అజహరుద్దీన్.

Also Read:Megastar Chiranjeevi: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అభిమాని కుటుంబానికి ఏం చేశారో తెలుసా?

IPL 2022: సరికొత్తగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన చెన్నై మాజీ ప్లేయర్.. ఇకపై ఐపీఎల్‌లో ఎలా కనిపించనున్నాడంటే?

Health Tips: నిత్యం ఆ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసమే