U19 World Cup: సెమీఫైనల్ టెన్షన్ లేదు.. వారి బౌలింగ్ చాలా సాధారణమైంది: టీమిండియా అండర్-19 కెప్టెన్
IND vs AUS: భారత అండర్-19 జట్టు కెప్టెన్ యశ్ ధుల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా బుధవారం ఆస్ట్రేలియాతో ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్ ఆడనుంది.
ICC Under-19 World Cup: విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్ అయ్యాడు. ప్రారంభంలో ప్రతిభ కనబరిచిన ఉన్ముక్త్ చంద్ అంచనాలను అందుకోలేకపోయాడు. అలాగే మన్జోత్ కల్రా సీనియర్ కెరీర్ నాలుగేళ్లుగా సరైన ప్రారంభం లభించలేదు. ఇది వారి కాలపు భారతదేశంలోని స్టార్ జూనియర్ క్రికెటర్ల కథ. వీరంతా భారతదేశ రాజధాని నుంచి వచ్చారు. వారందరి కథ భిన్నంగా ఉంది. ఈ ఉదాహరణలన్నీ భారత ప్రస్తుత ICC అండర్-19 ప్రపంచ కప్ జట్టు కెప్టెన్ యష్ ధుల్(Yash Dhull) ముందు ఉన్నాయి. బుధవారం ఆస్ట్రేలియాతో అండర్-19 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ (U-19 World Cup 2022)కు ముందు, ఈ ప్రతిష్టాత్మక పోటీ తర్వాత అసలు సవాలు ప్రారంభమవుతుందనే వాస్తవాన్ని కెప్టెన్ ధుల్ దాచలేదు. సెమీ-ఫైనల్ సందర్భంగా, ధుల్ మాట్లాడుతూ, “ఈ దశ తర్వాత, మేము రెండింతలు కష్టపడాలి. మరింత మెరుగుపడాలి. అండర్-19 స్థాయి నుంచి ఫస్ట్-క్లాస్ స్థాయికి ప్రయాణం తగినంత వేగంగా ఉండాలంటే మేం స్థిరంగా ఆడాలి. క్రమం తప్పకుండా పనితీరు కనబరచాలి. ప్రతిఫలంగా మేం జాతీయ జట్టులోకి ఎంపిక అవ్వగలం. కాబట్టి మన ఆటపై దృష్టి సారించి కష్టపడి పనిచేయాలి.
ధూల్, అతని అండర్-19 సహచరులు కొందరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భాగంగా ఉన్నారు. ఇది పెద్ద సెమీ-ఫైనల్ క్లాష్‌కు ముందు వారి మనస్సులో ఖచ్చితంగా ఉంటుంది. ‘ఐపీఎల్ వేలం జరగబోతోంది, నేను వర్తమానంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను, జరగాల్సింది జరుగుతుంది. నేను గేమ్‌పై దృష్టి సారించి బాగా రాణిస్తే భవిష్యత్తులో అది నాకు ప్రయోజనకరంగా ఉంటుంది’ అని ధూల్ తెలిపాడు.
అండర్-19కి లక్ష్మణ్ డైరెక్షన్.. నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ వెస్టిండీస్‌లో ఉండి జట్టుకు మార్గనిర్దేశం చేస్తున్నారు. లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో ఈ ఆటగాళ్లు ఆడటంతో వారి కల సాకారమైనట్లే. ధూల్ మాట్లాడుతూ, ‘లక్ష్మణ్ సార్, అతను తన అనుభవాలను మాతో పంచుకున్నాడు. ఇది రాబోయే మ్యాచ్‌లు, మైండ్‌సెట్, ప్రిపరేషన్‌లో మాకు సహాయపడుతుంది. నేను క్వారంటైన్‌లో ఉన్నప్పుడు అతను నాకు క్రమం తప్పకుండా కాల్ చేసేవాడు. నన్ను వీడియో కాల్‌లోనూ ప్రేరేపించాడు. రాబోయే మ్యాచ్‌లలో సానుకూలంగా, మంచి ఆలోచనతో ఉండమని చెప్పాడు’ అంటూ తెలిపాడు.
కూలిడ్జ్ గ్రౌండ్‌లోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా లేదని అడిగిన ప్రశ్నకు, “మేం మ్యాచ్ పరిస్థితిని అంచనా వేసి మా విధానం ఏమిటో నిర్ణయిస్తాం” అని ధుల్ చెప్పాడు. పిచ్‌పై ఆడే వరకు దాని గురించి ఏమీ చెప్పలేం. బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్-ఫైనల్‌లో భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. అయితే ఆస్ట్రేలియా బౌలింగ్ సాధారణ బౌలింగ్ అటాక్ అని, ఎన్నో ఏళ్లుగా ఆడి ఈ స్థాయికి సిద్ధమయ్యాం. భాగస్వామ్యాలను పరిశీలించి చివరి ఓవర్లలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపాడు.
Also Read: IPL 2022 Auction: రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో 48 మంది ఆటగాళ్లు.. పూర్తి జాబితా ఇదిగో..
IPL 2022 Mega Auction: మెగా వేలంలో ఈ నలుగురు ఆటగాళ్లు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?