Health Tips: నిత్యం ఆ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసమే

Constipation Home Remedies: దైనందిన జీవితంలో మనం తీసుకునే ఆహారం కారణంగా చాలామందికి ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతుంటాయి. జీర్ణక్రియ

Health Tips: నిత్యం ఆ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసమే
Constipation
Follow us

|

Updated on: Feb 02, 2022 | 7:59 AM

Constipation Home Remedies: దైనందిన జీవితంలో మనం తీసుకునే ఆహారం కారణంగా చాలామందికి ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతుంటాయి. జీర్ణక్రియ ప్రక్రియ సరిగా జరగకపోవడంతో పలు రకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్య అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతుంటుంది. మలబద్దకం (Constipation) వల్ల కడుపులో నొప్పి, ఇతర సమస్యలు వస్తుంటాయి. అయితే.. ఈ మలబద్దకం సమస్యను ప్రారంభంలోనే సులువుగా పరిష్కరించవచ్చు. అయితే ఇంటి చిట్కాలతోనే ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. మలబద్దకం నివారణకు పాటించవలసిన ఆ చిట్కాలేంటో (Health Care Tips) ఇప్పుడు తెలుసుకుందాం..

గోరువెచ్చని నీరు

మలబద్ధకం చికిత్సకు సులభమైన మార్గం గోరు వెచ్చని నీరు తాగడం. వీలైనప్పుడల్లా గోరువెచ్చని నీటిని తాగితే.. మలబద్ధకం సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం పరగడుపున కనీసం 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. దీంతోపాటు రోజంతా 2-4 లీటర్ల నీరు తాగాలి.

ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పటిష్టం చేస్తుంది. ప్రోబయోటిక్స్ ఆహారం మలబద్ధకం చికిత్సలో ప్రభావవంతంగా మారుతాయి. సౌర్‌క్రాట్, పెరుగు, కేఫీన్ వంటి ఆహారాలు సహజమైన ప్రోబయోటిక్స్ లభించే మూలికలు. తరచుగా పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

పైనాపిల్ జ్యూస్ – పైనాపిల్ జ్యూస్ రుచికరమైనది మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మలబద్ధకం, ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది.

సోపు గింజలు 

సోపు గింజలు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను పెంచుతాయి. మీ కడుపు ఆరోగ్యాన్ని ఉంచేందుకు రోజూ అర టీస్పూన్ సోపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తీసుకుంటే మేలు కలుగుతుంది. దీంతో అజీర్ణం, ఉబ్బరం వంటి ఉదరసమస్యలు తగ్గుముఖం పడతాయి.

పిప్పరమింట్ ఆయిల్

పిప్పరమింట్ యాంటిస్పాస్మోడిక్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2-3 చుక్కల పిప్పరమెంటు ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచింది. దీంతోపాటు పుదీనా టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.

Also Read:

తరచుగా తుమ్ములు వస్తున్నాయా.. అస్సలు తేలికగా తీసుకోవద్దు.. ఎందుకంటే..?

Raisins Side effects: ఎండుద్రాక్ష ఎక్కువగా తింటున్నారా? ఈ ప్రమాదం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?