తరచుగా తుమ్ములు వస్తున్నాయా.. అస్సలు తేలికగా తీసుకోవద్దు.. ఎందుకంటే..?

Sinus Issue: ఎక్కువ చలిగానీ, వేడిగానీ ఉంటే చాలా మందికి తుమ్ముల సమస్య ఉంటుంది. తరచుగా తుమ్ములు రావడం వల్ల తలనొప్పి ఇబ్బంది పెడుతుంది. ఏకాగ్రతతో దెబ్బతింటుంది. దీని నుంచి

తరచుగా తుమ్ములు వస్తున్నాయా.. అస్సలు తేలికగా తీసుకోవద్దు.. ఎందుకంటే..?
Sneezing
Follow us
uppula Raju

|

Updated on: Feb 01, 2022 | 9:54 PM

Sinus Issue: ఎక్కువ చలిగానీ, వేడిగానీ ఉంటే చాలా మందికి తుమ్ముల సమస్య ఉంటుంది. తరచుగా తుమ్ములు రావడం వల్ల తలనొప్పి ఇబ్బంది పెడుతుంది. ఏకాగ్రతతో దెబ్బతింటుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి వైద్యుడి సహాయం లేదా మందులు తీసుకుంటారు. కానీ తరచుగా ఇలా ఎందుకు జరుగుతుందో కారణం తెలుసుకోరు. నిజానికి దీని వెనుక సైనస్ లాంటి వ్యాధి ఉండవచ్చు. సైనస్ అనేది ముక్కులో ఎముక పెరుగడం వల్ల ఏర్పడిన ఒక వ్యాధి. దీని కారణంగా నిరంతరం తుమ్ములు వస్తుంటాయి. సైనస్ వల్ల ముక్కు కారడం మొదలవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని వదిలించుకోవడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. సైనస్ రావడానికి అలర్జీలు కూడా ఒక కారణం కావొచ్చు. చాలా మంది దీనిని తేలికగా తీసుకుంటారు కానీ ఎక్కువ అనారోగ్యంతో ఉండటం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇతర వ్యాధులు చుట్టు ముడుతాయి. వైద్యుల సలహా మేరకు ఇంటి పద్ధతుల ద్వారా కూడా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. అలాంటి కొన్ని హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం.

1. హైడ్రేటెడ్ గా ఉండండి

మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం మంచిది. మీరు సైనస్‌ను తొలగించాలనుకుంటే ఎక్కువ నీరు తాగాలి. ఇది కాకుండా మీరు ముక్కు లోపల పొడిని తొలగించడానికి ఇంట్లో హ్యూమిడిఫైయర్ ఉపయోగించవచ్చు. దీనివల్ల ముక్కు చుట్టూ తేమ ఉంటుంది.

2. చికెన్ సూప్

మీరు నాన్ వెజ్ తింటే చికెన్ సూప్ మీకు బెస్ట్ ఆప్షన్. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం లోపల వెచ్చగా ఉంటుంది. దీని వల్ల ముక్కుకు సంబంధించిన సమస్యలే కాదు ఛాతీకి సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేసే చికెన్ సూప్‌లో అనేక పదార్థాలు కలుపుతారు. విటమిన్ ఎ, జింక్, విటమిన్ సి అనేక యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కాబట్టి జలుబు సమయంలో తాగడం మంచిది.

3. ఆవిరి పట్టడం

ఇంట్లో ఆవిరి పట్టడం ద్వారా కూడా సైనస్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆవిరి పట్టడం వల్ల మూసుకుపోయిన ముక్కు తెరుచుకోవడంతోపాటు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. ఆవిరి పట్టడం వల్ల రెస్పిరేటరీ ట్రాక్ క్లియర్ అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆవిరిని తీసుకోవడం వల్ల శ్లేష్మం పలచబడి ఉపశమనం లభిస్తుంది. ఆవిరి పట్టేటప్పుడు ముఖాన్ని వేడి నీటికి దగ్గరగా ఉంచవద్దు 4 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఆవిరి పడితే సరిపోతుంది.

Alcohol: డైలీ ఆల్కహాల్ తీసుకుంటారా.. అధ్యయనంలో సంచలన నిజాలు..?

Socialmedia: సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారా.. క్యాన్సర్‌, గుండె జబ్బులు ఖాయం..?

Viral Photos: ఫిబ్రవరిలో ప్రేమికులు సందర్శించడానికి ఈ ప్రదేశాలు సూపర్.. అవేంటంటే..?