Socialmedia: సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారా.. క్యాన్సర్‌, గుండె జబ్బులు ఖాయం..?

Socialmedia Effect: సోషల్‌ మీడియా వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక వైద్య అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి.

Socialmedia: సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారా.. క్యాన్సర్‌, గుండె జబ్బులు   ఖాయం..?
Social Media
Follow us
uppula Raju

|

Updated on: Feb 01, 2022 | 9:36 PM

Socialmedia Effect: సోషల్‌ మీడియా వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక వైద్య అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవారిలో డిప్రెషన్, యాంగ్జయిటీ, ఆత్మహత్యా ధోరణులు పెరుగుతున్నాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్న మొదటి అధ్యయనం ఇది. ఎందుకంటే ఈ అధ్యయనంలో వైద్యులు వారి శరీరంలో ఒక నిర్దిష్ట రకం ప్రోటీన్ ఉన్నట్లు కనుగొన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది.

“సైబర్ సైకాలజీ, బిహేవియర్, సోషల్ నెట్‌వర్కింగ్ ” జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల 251 మందిపై అధ్యయనం గురించి చెబుతోంది. ఈ అధ్యయనానికి బఫెలో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ లీ నాయకత్వం వహించారు. అక్కడ సామాజిక పరస్పర చర్య, మానవ సంబంధాలను బోధిస్తారు. మానవ మనస్సు, శరీరం అంటే మానసిక, శారీరక ఆరోగ్యం ఎలా ముడిపడి ఉంటుందనే దానిపై వైద్య శాస్త్రం గత కొన్ని దశాబ్దాలుగా పని చేస్తుందని ప్రొపెసర్ డేవిడ్ లీ చెప్పారు. మనం ఏమనుకుంటున్నామో అది నేరుగా నేరుగా మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఏదైనా కారణం వల్ల మనుషుల్లో డిప్రెషన్ పెరిగిపోతే అది వారి శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందన్నారు.

ఈ అధ్యయనంలో సోషల్ మీడియాలో పావువంతు కంటే ఎక్కువ సమయం గడుపుతున్న యువతలో వారి శరీరంలో ఒక నిర్దిష్ట రకం ప్రోటీన్ పరిమాణం పెరిగినట్లు కనుగొన్నట్లు లీ చెప్పారు. ఇది భయంకరమైన సంకేతం ఎందుకంటే ఈ ప్రోటీన్ అధికంగా ఉంటే హృదయ సంబంధ వ్యాధులకు, దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుందన్నారు. సోషల్ మీడియా పూర్తిగా చెడ్డది చెప్పడంలేదని కానీ మితిమీరినది ఖచ్చితంగా ప్రమాదకరమని లీ అన్నారు. సోషల్ మీడియాలో మాత్రమే జీవించే వ్యక్తులు నిజ జీవిత బంధాలను కోల్పోతారని హెచ్చరించారు. అలాగే సోషల్‌ మీడియాలో ఎక్కువసేపు గడిపితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని తద్వారా రకరకాల రోగాలు చుట్టుముడుతాయని తెలిపారు.

Alcohol: డైలీ ఆల్కహాల్ తీసుకుంటారా.. అధ్యయనంలో సంచలన నిజాలు..?

Realme: హృదయ స్పందన కొలిచే ఫీచర్‌తో వస్తున్న రియల్‌మి 9 ప్రో ప్లస్.. 5G సపోర్ట్ కూడా..?

Viral Photos: ఫిబ్రవరిలో ప్రేమికులు సందర్శించడానికి ఈ ప్రదేశాలు సూపర్.. అవేంటంటే..?